డోన్ కోర్టుకు హాజరైన గంగిరెడ్డి
డోన్ టౌన్ : ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని మంగళవారం కడప పోలీసులు డోన్ కోర్టులో హాజరుపరిచారు. పలు కేసుల్లో నిందితుడైన ఇతను.. కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. డోన్‌లో గతేడాది ఎర్రచందనం పట్టుబడిన కేసులో నిందితుడిగా ఉన్నందున కడప నుంచి పోలీస్ బందోబస్తు మధ్య డోన్‌కు తీసుకొచ్చి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.