
సాక్షి, హైదరాబాద్: ముత్యాల యోగి కుమార్ అనే వ్యక్తిని బూటు కాలితో తన్నిన షీటీమ్స్ ఇన్‌చార్జి, మాదాపూర్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డిని సిటీ ఆర్మ్‌డ్ రిజర్వు(సీఎఆర్) హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. షార్టు ఫిలింలో నటించే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హారిక ఫిర్యాదు మేరకు యోగిని విచారణకు పిలిచి ఏడీసీపీ గంగిరెడ్డి బూటు కాలితో తన్నినట్లు టీవీ చానళ్లలో వచ్చింది. అందులో వాస్తవం ఎంత ఉందో విచారణ చేపట్టాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. ఈమేరకు డీసీపీ విశ్వప్రసాద్‌ను విచారణ అధికారిగా నియమించిన విషయం విదితమే. ఈ క్రమంలో గంగిరెడ్డిని బదిలీ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment