ADCP
-
Crime: పగలు రెక్కీ.. రాత్రికి చోరీ! తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా..
సాక్షి, విశాఖపట్నం: పగలు ఆటో నడుపుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి... రాత్రి వేళ ఆ ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్ కాన్ఫరెన్స్ హాలులో క్రైం ఏడీసీపీ శ్రావణ్‌కుమార్ మీడియాకు శుక్రవారం వెల్లడించారు. రైల్వే న్యూ కాలనీ సమీప శివాలయం వీధికి చెందిన షేక్ సహీద్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. పగలు అంతా నగరంలోని పలు ప్రాంతాల్లో ఆటో నడుపుతూ... ఆ సమయంలో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రెక్కీ నిర్వహించేవాడు. అనంతరం రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి వేపగుంట సమీప నాయడుతోట అప్పలనర్సయ్య కాలనీలో మున్సి లియాకత్ కుటుంబంతో నివసిస్తున్నారు. ఆయన గత ఏడాది డిసెంబర్ 27న కుమారుడి రిసెప్సన్ కోసం వేరే ప్రాంతానికి వెళ్లారు. ఆ ఇంటిని, వారి కదలికలను నిశితంగా గమనిస్తున్న షేక్ సహీద్ అదే రోజు రాత్రి ఆ ఇంటిలో చోరీకి పాల్పడ్డాడు. ఇంటి వెనక డోర్ తాళం పగలుగొట్టి 8 తులాల బంగారు ఆభరణాలు, రూ.2.30 లక్షల నగదు అపహరించుకుపోయాడు. మీడియాతో మాట్లాడుతున్న క్రైం ఏడీసీపీ శ్రావణ్‌కుమార్ పట్టించిన సీసీ కెమెరాలు కుమారుడి రిసెప్సన్ కార్యక్రమం తర్వాత మరుసటి రోజు డిసెంబర్ 28న ఇంటికి వచ్చిన మున్సి లియాకత్ చోరీ జరిగిందని గుర్తించి పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఏసీపీ పెంటారావు నేతృత్వంలో సీఐలు లూథర్‌బాబు, సింహాద్రినాయుడు, ఎస్ఐలు ఎం.రాధాకృష్ణ, డి.కాంతారావు, ఎం.గణపతిరావు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో చోరీ జరిగిన ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించగా షేక్ సహీద్ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించడంతోపాటు మరో ఐదు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడు. ఫోర్త్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, కంచరపాలెం పీఎస్ పరిధిలో ఒక చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు. మొత్తం 17 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.3.80 లక్షల నగదు చోరీ చేయగా... 15 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.2.45 లక్షల నగదు, ఒక బైక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు దొంగలించిన బంగారం కొనుగోలు చేస్తూ సహకరించిన పుట్టా భరత్‌కుమార్, బిక్కలు కళావతి, లంకా కామేశ్వరిలను పోలీసులు అరెస్ట్ చేశారు. సమావేశంలో ఏసీపీ పెంటారావు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. చదవండి: Nellore: పాపం పసివాళ్లు! అమ్మానాన్నలు కాదనుకున్న అభాగ్యులు -
అక్రమ సంబంధం; భర్త తలకు తుపాకీతో గురి
సాక్షి, రంగారెడ్డి : జిల్లాలో ఓ అక్రమ సంబంధం వ్యవహారం కలకలం రేపింది. అక్రమ సంబంధంపై నిలదీసిన భర్తను కాల్చిపడేస్తానంటూ నిందితుడు బెదిరింపులకు దిగడంతో బాదితుడు పోలీసులను ఆశ్రయించాడు. వివరాలు.. మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామానికి చెందిన శైలజ, రాజు భార్యాభర్తలు. అయితే, గత కొంతకాలంగా రాచకొండ ఏడీసీపీ శిల్పవల్లి వద్ద గన్‌మెన్‌గా పనిచేసే రమేష్, శైలజ మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, నిన్న రాత్రి (సోమవారం) 7 గంటల సమయంలో శైలజ, రమేష్ ఇంట్లో ఉండగా గమనించిన రాజు వారిని నిలదీశాడు. దీంతో రమేష్, రాజు మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో రమేశ్ తనను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడని రాజు మొయినాబాద్ పోలీసులకు పిర్యాదు చేశాడు. తుపాకీతో గురిపెట్టి కాల్చిపడేస్తానంటూ రమేష్ తనను హెచ్చరించాడని రాజు కంప్లెయింట్‌లో పేర్కొన్నాడు. ఇదిలాఉండగా.. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తోందని కొందరు విమర్శలు చేస్తున్నారు. అసలు ఎలాంటి పర్మిషన్ లేకుండా రమేష్ తన రివాల్వర్ ఎలా తీసుకెళ్లాడని ఆరోపణలు చేస్తున్నారు. -
‘కార్’కు ఏడీసీపీ గంగిరెడ్డి బదిలీ
సాక్షి, హైదరాబాద్: ముత్యాల యోగి కుమార్ అనే వ్యక్తిని బూటు కాలితో తన్నిన షీటీమ్స్ ఇన్చార్జి, మాదాపూర్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డిని సిటీ ఆర్మ్డ్ రిజర్వు(సీఎఆర్) హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. షార్టు ఫిలింలో నటించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ హారిక ఫిర్యాదు మేరకు యోగిని విచారణకు పిలిచి ఏడీసీపీ గంగిరెడ్డి బూటు కాలితో తన్నినట్లు టీవీ చానళ్లలో వచ్చింది. అందులో వాస్తవం ఎంత ఉందో విచారణ చేపట్టాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. ఈమేరకు డీసీపీ విశ్వప్రసాద్‌ను విచారణ అధికారిగా నియమించిన విషయం విదితమే. ఈ క్రమంలో గంగిరెడ్డిని బదిలీ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు. -
ఉన్నతాధికారినంటూ ఘరానా మోసం
‘మీ ఉన్నతాధికారిని మాట్లాడుతున్నాను. మా బంధువు పరీక్ష రాసేందుకు వస్తే బ్యాగ్ కొట్టేశారు. హాల్ టికెట్, నగదు పోయింది. కాలేజీ నిర్వాహకులతో మాట్లాడి పరీక్ష రాయించే ఏర్పాట్లు చేయండి’ అంటూ..తానే కాలేజీ ప్రిన్సిపాల్ అవతారం ఎత్తి సెక్యూరిటీ డిపాజిట్ పేరిట నగదు గుంజుతున్న ఓ ఘరానా మోసగాడు సీసీఎస్ పోలీసులకు చిక్కాడు. * నిందితుడి అరెస్టు * రూ.50 వేల నగదు, సిమ్ కార్డులు స్వాధీనం * సమాచారం ఇవ్వండి: ఏడీసీపీ విజయవాడ సిటీ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు శాఖల ఉన్నతాధికారి పేరిట పలువురిని మోసగించి నగదు గుంజే తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన మాచిరాజు బాలత్రిపుర సుందరరావు అలియాస్ సుధీర్(30)ను సీసీఎస్(సెంట్రల్ క్రైం స్టేషన్) పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.50వేల నగదు, నేరం చేసేందుకు ఉపయోగించిన రెండు సిమ్‌కార్డులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అదనపు డీసీపీ(క్రైమ్స్) జి.రామకోటేశ్వరరావు శనివారం వన్‌టౌన్ పోలీసు స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ(క్రైమ్స్) గుణ్ణం రామకృష్ణతో కలిసి ఇందుకు సంబంధించిన వెల్లడించారు. అదనపు డీసీపీ కథనం ప్రకారం.. సుధీర్ సమాచార హక్కు చట్టం వెబ్సైట్ ద్వారా ఉన్నతాధికారులు, ఆయా శాఖలకు సంబంధించిన జోనల్, రీజినల్ అధికారుల వివరాలు, ఫోన్ నంబర్లు సేకరించి మోసాలకు పాల్పడుతున్నాడు. గత ఏడాది కాలంగా విజయవాడ, విజయనగరం, చిత్తూరు, కృష్ణాజిల్లా నందిగామ సహా ఎనిమిది చోట్ల అధికారులను మోసగించి సొమ్ము చేసుకున్నాడు. ముందస్తు సమాచారంతో నిందితుడు పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో ఉండగా సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేశారు. మోసగించేది ఇలా ముందుగా తానుండే ప్రాంతంలో ఆటో డ్రైవర్, లాడ్జి నిర్వాహకులను పరిచయం చేసుకొని తన వాళ్లు డబ్బులు పంపుతారని చెప్పి బ్యాంక్ అకౌంట్ నంబరు తీసుకుంటాడు. అనంతరం ముందుగా సేకరించుకున్న నంబర్లలో ఏదైనా ప్రభుత్వ శాఖ ఉన్నతాధికారి పీఏ(సహాయకుడు) లాగా దిగువస్థాయి అధికారులతో మాట్లాడతాడు. తన బాస్ మాట్లాడతాడని చెప్పి..తానే ఫోన్ వెనక్కి తిప్పి మాట్లాడుతూ తమ బంధువును కాలేజీ ప్రిన్సిపాల్ పరీక్ష రాయనీయడం లేదని చెప్పి మాట్లాడమంటూ తనకే చెందిన మరో ఫోన్ నంబర్ ఇస్తాడు. అటునుంచి ఫోన్ రాగానే తనను తాను ప్రిన్సిపల్‌గా చెప్పుకొని హాల్ టికెట్టు లేకుండా పరీక్ష రాయడం కుదరదని, కావాలంటే రూ.20వేలు సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లిస్తే అవకాశం కలిపిస్తామని చెపుతాడు. బాస్ తాలూకు బంధువును పరీక్ష రాయించాలనే నిర్ణయంతో కాలేజీ ప్రిన్సిపాల్ పేరిట ఇచ్చే అకౌంట్లో డబ్బు జమ చేస్తాడు. ఆ డబ్బు జమ అయిన వెంటనే ముందుగానే చెప్పినట్టు వారిని కలిసి డబ్బులు డ్రా చేయించుకొని ఉడాయిస్తుంటాడు. నగరంలోని కాలుష్య నియంత్రణ మండలి(పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) అధికారిని ఇలానే బురిడీ కొట్టించి డబ్బు గుంజినట్టు పోలీసుల విచారణలో నిందితుడు అంగీకరించాడు. ఇప్పటి వరకు 11 వరకు ఈ తరహా మోసాలు చేశాడని డీసీపీ తెలిపారు. సమాచారం ఇవ్వండి ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అదనపు డీసీపీ(క్రైమ్స్) జి.రామకోటేశ్వరరావు తెలిపారు. ఇలాంటి నేరాల గురించి తెలిసినా, అనుమానం వచ్చినా తన మొబైల్ నంబరు 94406 27057, ఏసీపీ(క్రైమ్స్) నెం. 94409 06871 లేదా 100, 1090కి తెలియపరచాలన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్సైలు కె.శ్రీధర్, వి.అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు.