ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, రంగారెడ్డి : జిల్లాలో ఓ అక్రమ సంబంధం వ్యవహారం కలకలం రేపింది. అక్రమ సంబంధంపై నిలదీసిన భర్తను కాల్చిపడేస్తానంటూ నిందితుడు బెదిరింపులకు దిగడంతో బాదితుడు పోలీసులను ఆశ్రయించాడు. వివరాలు.. మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామానికి చెందిన శైలజ, రాజు భార్యాభర్తలు. అయితే, గత కొంతకాలంగా రాచకొండ ఏడీసీపీ శిల్పవల్లి వద్ద గన్‌మెన్‌గా పనిచేసే రమేష్, శైలజ మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, నిన్న రాత్రి (సోమవారం) 7 గంటల సమయంలో శైలజ, రమేష్ ఇంట్లో ఉండగా గమనించిన రాజు వారిని నిలదీశాడు. దీంతో రమేష్, రాజు మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో రమేశ్ తనను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడని రాజు మొయినాబాద్ పోలీసులకు పిర్యాదు చేశాడు. తుపాకీతో గురిపెట్టి కాల్చిపడేస్తానంటూ రమేష్ తనను హెచ్చరించాడని రాజు కంప్లెయింట్‌లో పేర్కొన్నాడు. ఇదిలాఉండగా.. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తోందని కొందరు విమర్శలు చేస్తున్నారు. అసలు ఎలాంటి పర్మిషన్ లేకుండా రమేష్ తన రివాల్వర్ ఎలా తీసుకెళ్లాడని ఆరోపణలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment