అనంతపురం న్యూసిటీ: నగరపాలక సంస్థ ప్రజావైద్యాధికారి (మెడికల్ హెల్త్ ఆఫీసర్–ఎంహెచ్‌ఓ)గా గంగిరెడ్డి నియమితులయ్యే అవకాశం ఉందని సంస్థ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎంహెచ్‌ఓగా పనిచేస్తున్న డాక్టర్ గంగాధరరెడ్డి సొంతశాఖ అయిన వైద్య ఆరోగ్యశాఖకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు రిలీవ్ చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో శానిటేషన్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న గంగిరెడ్డికి ఎంహెచ్‌ఓ బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
ఎంహెచ్‌ఓగా గంగిరెడ్డి...?
Published Thu, Aug 18 2016 12:00 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement