అభిమానిని దారుణంగా హత్య చేసిన కేసులో కన్నడ హీరో దర్శన్ ఇటీవల అరెస్ట్ అయ్యాడు. ఇతడి ప్రేయసి, హీరోయిన్ పవిత్ర గౌడని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఇక రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో భాగంగా తాజాగా దర్శన్ కారు డ్రైవర్ రవి.. చిత్రదుర్గ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. మరోవైపు రేణుకా స్వామి పోస్ట్ మార్టం జరగ్గా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
(ఇదీ చదవండి: 'కన్నప్ప' సినిమా తీయమని శివుడు చెప్పాడు: మంచు విష్ణు)
ఈ కేసు పూర్వపరాలు పరీశిలిస్తే.. దర్శన్‌కి వీరాభిమాని రేణుకా స్వామి. కానీ తన అభిమాన హీరో భార్య దగ్గర కంటే ప్రేయసి పవిత్ర గౌడతో ఎక్కువగా ఉంటున్నాడని ఆమెకు, రేణుకా స్వామి అసభ్యకర మెసేజులు పంపించేవాడు. దీంతో సీరియస్ అయిన దర్శన్, తన స్నేహితులతో కలిసి ఈ నెల 8న రేణుకా స్వామిని హత్య చేశాడు. మృత దేహాన్ని బెంగళూరు కామాక్షి పాల్య పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైనేజీలో పడేశారు. అయితే రేణుకా స్వామి భార్య.. తన భర్త కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మొత్తం వ్యవహారం బయటకొచ్చింది.
పోలీసులు దర్యాప్తు చేసి ఈ కేసులో మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు. కన్నడ హీరో దర్శన్ ఏ-1, పవిత్ర గౌడ ఏ-2గా గుర్తించారు. రీసెంట్‌గా రేణుకా స్వామి పోస్ట్ మార్టం చేశారు. ఇతడి మర్మాంగాలపై గట్టిగా కొట్టడంతో చనిపోయినట్లు తేలింది. ఇది ఇప్పుడు అందరినీ షాక్‌కి గురి చేస్తోంది. ఇకపోతే దర్శన్, పవిత్ర గౌడకు ఈ నెల 17 వరకు కోర్టు రిమాండ్ విధించింది.
(ఇదీ చదవండి: విజయ్ సేతుపతి 'మహారాజ' సినిమా రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment