చిక్కుల్లో చిత్ర పరిశ్రమ.. ఎలా ఉండేది ఎలా అయిపోయింది! | Darshan And Pavitra Jayaram Issues In Tollywood Sandalwood | Sakshi
Sakshi News home page

ఈ మధ్య మరీ ఎక్కువైపోతున్న కాంట్రవర్సీలు.. ఎందుకిలా?

Published Sat, Jun 15 2024 7:46 PM | Last Updated on Sat, Jun 15 2024 8:13 PM

Darshan And Pavitra Jayaram Issues In Tollywood Sandalwood

సినిమాలో హీరోహీరోయిన్‌కి కష్టాలు ఉండటం కామన్. కానీ ఇప్పుడు వాళ్లకు రియల్ లైఫ్‌లోనూ ఇబ్బందులు తప్పట్లేదు. కొందరు వీటిని కోరి తెచ్చుకుంటే మరికొందరు మాత్రం ఊహించని విధంగా ప్రమాదాల్లో ఇరుక్కుంటున్నారు. దీంతో ఎన్నడూ లేనిది ఒక్కసారిగా ఇండస్ట్రీలో మూడ్ మారిపోయింది. ఎంతలా అంటే సినిమాల గురించి మాట్లాడుకునే వాళ్లు కాస్త సెలబ్రిటీలని ఊహించని చోట చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ అసలేం జరుగుతోంది?

దర్శన్ కేసు
కన్నడ హీరో దర్శన్ అరెస్ట్. ఈ మధ్య కాలంలో దీనంత షాకింగ్ సంఘటన మరొకటి లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో ఇతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు గురించి సింపుల్‌గా చెప్పుకొంటే.. దర్శన్‌కి ఇదివరకే విజయ్ లక్ష‍్మితో పెళ్లయింది. కానీ పవిత్ర గౌడ అనే నటితో గత కొన్నేళ్లుగా రిలేషన్‌లో ఉన్నాడు. అయితే తన అభిమాన హీరో కుటుంబంలో కలతలకు ఈమెనే కారణమని భావించిన ఓ అభిమాని.. పవిత్రకు అసభ్యకర ఫొటోలు, వీడియోలని పంపించాడు. దీంతో పవిత్ర, ఈ విషయాన్ని దర్శన్‌కి చెప్పగా ఇతడు సదరు వ్యక్తిని దారుణంగా హత్య చేయించాడు. ఇప్పుడు అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు.

(ఇదీ చదవండి: కవలలకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్)

పవిత్ర-చందు మరణాలు
తెలుగు సీరియల్ 'త్రినయని'లో కీలక పాత్ర పోషిస్తున్న నటి పవిత్ర జయరాం.. కొన్నిరోజుల క్రితం సొంతూరి నుంచి హైదరాబాద్‌కి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించింది. అయితే ఈమెని ప్రేమిస్తున్న సహ నటుడు చందు.. ఈమె మరణాన్ని తట్టుకోలేక పవిత్ర చనిపోయిన రెండు మూడు రోజుల్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మరణాలు అందరికీ షాకయ్యేలా చేశాయి.

డ్రగ్స్ కేసులో హేమ 
టాలీవుడ్‌లో డ్రగ్స్, రేవ్ పార్టీ లాంటివి అప్పుడప్పుడు వినిపించే మాటలు. రీసెంట్‌గా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో తెలుగు నటి హేమ ఉండటం, ఈ కేసులో ఆమెని అరెస్ట్ చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఆమెని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఆమెకు బెయిల్ కూడా వచ్చింది. అయితే ఎన్నడూ లేనిది ఇలా ఒకటి తర్వాత ఒకటి అన్నట్లు దక్షిణాదిలో పలు షాకింగ్ సంఘటనలు జరుగుతుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇందులో కొన్ని స్వీయ తప్పిదాలు ఉండగా, మరికొన్ని అనుకోకుండా జరిగినవి. మరి వీటికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో చూడాలి?

(ఇదీ చదవండి: ఏడేళ్లుగా కనిపించని దర్శన్‌ మేనేజర్‌.. కారణం ఏంటి..?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement