
అజయ్ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంతో ఇర్ఫాన్ తెరంగేట్రం చేయబోతున్నట్టు తెలిసింది.
రాంచి : టీమిండియా పేస్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్నాడు. తమిళ సూపర్‌స్టార్ విక్రమ్‌తో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నాడు. ఈ విషయాన్ని ఇర్ఫానే స్వయంగా ట్విటర్‌లో పేర్కొన్నాడు. అజయ్ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంతో ఇర్ఫాన్ తెరంగేట్రం చేయబోతున్నట్టు తెలిసింది. ఙ్ఞానముత్తు ఇదివరకు డిమొంటే కాలనీ, ఇమైక్క నొడిగల్ సినిమాలకు దర్శకత్వం వహించారు.
అయితే, ఈ సినిమాలో ఏ రకమైన పాత్ర పోషించబోతున్నదీ ఇర్ఫాన్ వెల్లడించలేదు. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా 7 స్క్రీన్ స్టూడియో పతాకంపై సినిమా నిర్మాణం జరుగునున్నట్టు సమాచారం. కాగా, 2012లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్ ఇర్ఫాన్ కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్. ఇక దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఇర్ఫాన్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్‌లో సభ్యుడిగా ఉన్నాడు.
New venture,new challenge looking forward to it
— Irfan Pathan (@IrfanPathan) October 14, 2019
@AjayGnanamuthu @iamarunviswa @7screenstudio
@arrahman
@Lalit_SevenScr #ChiyaanVikram58 @sooriaruna
@proyuvraaj @LokeshJey@VishalSaroee pic.twitter.com/yZ99OZyJrl