![Kannada Actor Helps Nab Bike Borne Thieves In Bengaluru - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/28/rb.jpg.webp?itok=UDpG4nXf)
బెంగళూరు: సాధారణంగా సినిమాల్లో మన హీరోలు దొంగలను, హంతకులను అవినీతిపరులను వెంటాడడం చూస్తుంటాం. కానీ నిజజీవితంలో అదే హీరోలు ఏమైనా జరిగితే మాత్రం పెద్దగా స్పందించరు. కానీ కన్నడ హీరో రఘుబట్ రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ హీరోనే అంటూ నిరూపించుకున్నాడు. బెంగళూరులో శుక్రవారం తెల్లవారుజామున క్యాబ్ డ్రైవర్‌ని వద్ద చోరీ చేసి పరారవుతున్న ఇద్దరు దొంగలను.. అటుగా ఫార్చ్యూనర్ కారులో వెళుతున్న హీరో రఘుభట్ గమనించారు. వెంటనే దొంగల బైక్‌ను సుమారు రెండు కిలోమీటర్ల వరకు వెంబడించిగా.. సెయింట్ జాన్సన్ స్కూల్ సర్కిల్ వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పి బోల్తా పడింది. వెంటనే రఘుభట్ వారిరువురిని పట్టుకున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. మొహిన్ తలకు, అబ్దుల్లా చేయికి గాయాలు కావడంతో, ఇరువురిని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment