'కేజీఎఫ్' సినిమాతో తెలుగులో బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న యష్.. ఇప్పుడు ఊహించని వివాదంలో చిక్కుకున్నాడు. ఇతడు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'టాక్సిక్'. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలవగా.. రీసెంట్‌గా బెంగళూరు సమీపంలోని పీణ్య-జలహళ్లి దగ్గరలో కొత్త షెడ్యూల్ మొదలైంది. రెండు రోజులు షూటింగ్ చేశారు. అయితే సెట్ నిర్మాణ కోసం అక్రమంగా వేలాది చెట్లు నరికేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే.. 'టాక్సిక్' మూవీ టీమ్ చెట్లు నరికేశారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేయడంతో పాటు స్యయంగా ఆ ప్రదేశానికి వెళ్లి సందర్శించారు. చెట్ల నరికివేతకు అనుమతించిన వ్యక్తులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో షూటింగ్ అర్థంతరాంగా నిలిచిపోయింది.
(ఇదీ చదవండి: హత్య కేసులో కన్నడ హీరో దర్శన్‌కి మధ్యంతర బెయిల్)
అటవీ, జీవావరణ, పర్యావరణ శాఖ అదనపు ముఖ్య కార్యదర్శికి రాసిన నోట్‌లో బెంగళూరులోని పీణ్య ప్లాంటేషన్ 1, ప్లాంటేషన్ 2లోని 599 ఎకరాల గెజిటెడ్ రిజర్వ్ ఫారెస్ట్ భూమిని హిందుస్థాన్ మెషిన్ టూల్స్ (HMT)కి చట్టవిరుద్ధంగా బదలాయించిన విషయాన్ని ఎత్తి చూపారు. హెచ్‌ఎంటీ ఆధీనంలో అటవీ భూమిని సినిమా షూటింగ్‌ల కోసం లీజుకు ఇస్తోందని, అటవీ భూమిలో అనధికారికంగా చెట్ల నరికివేత నేరమని మంత్రి ఈశ్వర్ చెప్పుకొచ్చారు. దీనిపై విచారణ తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
హెచ్ఎమ్‌టీకి ఈ భూమిని పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు అక్రమంగా విక్రయించింది. దీంతో అక్కడ చెట్ల నరికివేత జరిగింది. తాజాగా టాక్సిక్ షూటింగ్ కోసం చాలా చెట్లని కొట్టేసి మరీ సెట్ వేశారనే తెలుస్తోంది. ఈ మేరకు శాటిలైట్ ఫొటోలని మంత్రి ట్వీట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
(ఇదీ చదవండి: నటితో ప్రేమ.. పెళ్లికి సిద్ధమైన 'కలర్ ఫోటో' దర్శకుడు!)
ಎಚ್.ಎಂ.ಟಿ. ವಶದಲ್ಲಿರುವ ಅರಣ್ಯ ಭೂಮಿಯಲ್ಲಿ ‘ಟಾಕ್ಸಿಕ್’ ಎಂಬ ಚಲನಚಿತ್ರದ ಚಿತ್ರೀಕರಣಕ್ಕಾಗಿ ನೂರಾರು ಮರಗಳನ್ನು ಅಕ್ರಮವಾಗಿ ಕಡಿದು ಹಾನಿಗೊಳಿಸಿರುವ ವಿಚಾರ ಗಂಭೀರ ಚಿಂತೆ ಮೂಡಿಸಿದೆ. ಸ್ಯಾಟೆಲೈಟ್ ಚಿತ್ರಗಳಿಂದ ಈ ಅಕ್ರಮ ಕೃತ್ಯವು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಕಾಣುತ್ತಿದ್ದು, ಇಂದು ಸ್ಥಳಕ್ಕೆ ಭೇಟಿ ನೀಡಿ ಪರಿಶೀಲನೆ ನಡೆಸಿದ್ದೇನೆ. ಈ ಅಕ್ರಮ ಕೃತ್ಯಕ್ಕೆ… pic.twitter.com/yrjHhG9kLA
— Eshwar Khandre (@eshwar_khandre) October 29, 2024
Comments
Please login to add a commentAdd a comment