సాక్షి, బెంగళూరు: డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు శాండల్‌వుడ్‌ను కుదిపేస్తున్నాయి. పోలీసుల విచారణలో కన్నడ నటీనటులు, దర్శకులు, నిర్మాతల పేర్లు ఒక్కటొక్కటిగా బయటకు వస్తుండటంతో సినీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఈ కేసులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల (సీసీబీ) హీరోయిన్ రాగిణి ద్వివేది ఇంటిపై శుక్రవారం తెల్లవారుజామున దాడి చేసి ఆమెను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా డ్రగ్స్ వ్యవహారంలో మరో నటి సంజన ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు ఈరోజు ఆమెను అరెస్టు చేసినట్లు సమాచారం. కాగా నటి సంజన సన్నిహితుడు, రియల్‌ఎస్టేట్ వ్యాపారి రాహుల్ ఇప్పటికే అరెస్టైన విషయం తెలిసిందే.(చదవండి: రంగుల తెరపై డ్రగ్స్ మరక!)
అతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్ డేటాను సేకరించే పనిలో ఉన్నారు. మొబైల్‌లోని పలు ఫోటోలు, వీడియోల ఆధారంగా పలువురికి నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో సంజన పేరు బయటకు రావడంతో రాగిణితో తనకు సంబంధం లేదని, ఇద్దరూ ఒక సినిమాలో మాత్రం కలిసి నటిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇక పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన సంజన.. ‘బుజ్జిగాడు’ సినిమాతో టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు పొందారు.( చదవండి: సినీ సెలబ్రిటీల గుట్టు బయటపెట్టిన అనికా!)
టాలీవుడ్ డ్రగ్స్ కేసును తలపిస్తున్న కన్నడ చిత్ర సీమ వ్యవహారం
రెండేళ్ల క్రితం తెలుగు సినీ పరిశ్రమలోనూ డ్రగ్స్ వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అకున్ సబార్వాల్ నేతృత్వంలోని సిట్ అనేక మంది టాలీవుడ్ ప్రముఖ హీరోలు, హీరోయిన్లు, దర్శకులను విచారించారు. పూరీ జగన్నాథ్, రవితేజ, తరుణ్, నవదీప్, నందు, తనీష్, ఛార్మి, ముమైత్‌ఖాన్, సుబ్బరాజు, శ్యాం కే నాయుడు తదితరులు సిట్ ఎదుట విచారణకు హాజరైన తారల లిస్టులో ఉన్నారు. ఇక ఇటీవల శాండల్‌వుడ్‌లోనూ ఇదే తరహా డ్రగ్స్ వ్యవహారం వెలుగుచూసింది. ఈ క్రమంలో ఆగష్టులో ముగ్గురు డ్రగ్ పెడ్లర్స్‌ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అనిఖా అనే యువతి కూడా ఉంది. సోదాల్లో భాగంగా ఆమె.. డైరీ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులో కన్నడ ఇండస్ట్రీకి చెందిన పలువురు పేర్లను గుర్తించారు.
విచారణలో భాగంగాపలువురు హీరోలు, హీరోయిన్లు, సింగర్లకు అనిఖా డ్రగ్స్ సరఫరా చేసినట్లు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతితో సెర్చ్ వారెంట్ తీసుకుని.. పలువురు సెలబ్రిటీలు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటికే ఆరుగుని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. మరోవైపు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు బీ-టౌన్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment