దేవాలయాల సందర్శనలో 'కేజీఎఫ్' హీరో.. అన్నదానంలోనూ | Actor Yash Temples Visit Before Toxic Movie Shooting | Sakshi
Sakshi News home page

Yash: రెండేళ్ల తర్వాత షూటింగ్‌కి.. అదీ సెంటిమెంట్ రోజే

Aug 7 2024 9:16 AM | Updated on Aug 7 2024 10:46 AM

Actor Yash Temples Visit Before Toxic Movie Shooting

'కేజీఎఫ్ 2' వచ్చి రెండేళ్లు దాటిపోయింది. కానీ హీరో యష్ ఎక్కడా కనబడట్లేదు. 'టాక్సిక్' అనే మూవీ చేస్తున్నాడని అన్నారు గానీ లుక్ లాంటిదేం బయటకు రాలేదు. కానీ ఇప్పుడు కర్ణాటకలోని ప్రముఖ దేవాలయాల్ని కుటుంబంతో సందర్శిస్తూ కనిపించాడు. సామాన్యుడిలా దర్శనం చేసుకోవడమే కాదు అన్నదానంలోనూ సింపుల్‪‍‌గా కనిపించి ఆశ్చర్యపరిచాడు.

(ఇదీ చదవండి: బాలీవుడ్ చేయలేనిది.. 'దేవర' చేసి చూపించాడు!)

'కేజీఎఫ్' తర్వాత యష్ ఎలాంటి సినిమా చేస్తాడా? ఎప్పుడు రిలీజ్ చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇందుకు తగ్గట్లే 'టాక్సిక్' అనే మూవీని యష్ ప్రకటించాడు. కానీ ఇప్పటివరకు అసలు షూటింగ్‌లోనే పాల్గొనలేదు. తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టారు. ఆగస్టు 8 నుంచి యష్‍‌కి సంబంధించిన షూటింగ్ మొదలవుతుందని నిర్మాతలు ప్రకటించారు.

యష్‌కి బాగా కలిసొచ్చిన సంఖ్య 8. జనవరి 8వ తేదీన పుట్టాడు. బహుశా అందుకేనేమో ఈ నంబర్ కలిసొచ్చేలా ఎనిమిదో నెల ఎనిమిదో తారీఖున షూటింగ్‌కి వెళ్లాలని ఇన్నాళ్లు ఆగినట్లున్నాడు. మలయాళ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తీస్తున్న 'టాక్సిక్'.. గ్యాంగస్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలోకి రావొచ్చు.

(ఇదీ చదవండి: బంగ్లాదేశ్ అల్లర్లలో విషాదం.. యువ హీరోతో పాటు అతడి తండ్రిని!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement