‘కేజీఎఫ్: చాప్టర్ 1, కేజీఎఫ్: చాప్టర్ 2’ వంటి చిత్రాలతో రాఖీ భాయ్‌గా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గుర్తింపు సొంతం చేసుకున్నారు యశ్. ఆ సినిమాల తర్వాత యశ్(Yash) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్‌అప్స్’. ఈ చిత్రానికి మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ కె. నారాయణ, యశ్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ కొన్నాళ్లుగా జరుగుతోంది. అయినప్పటికీ హీరోయిన్ ఎవరనే విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో కియారా అద్వానీ, కరీనా కపూర్, నయనతార వంటి హీరోయిన్ల పేరు తెరపైకి వచ్చాయి.
ఫైనల్‌గా యశ్‌కి జోడీగా నయనతార(Nayanthara) నటిస్తున్నట్లు ఈ మూవీలో కీలక పాత్ర చేస్తున్న బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ మాటలతో స్పష్టత వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ ఒబెరాయ్ మాట్లాడుతూ– ‘‘యశ్ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా షూటింగ్‌తో ప్రస్తుతం బిజీగా ఉన్నాను. ఇందులో నయనతార కూడా భాగమయ్యారు.
ఇంతకు మించి వివరాలను నేను ఇప్పుడే వెల్లడిస్తే బాగోదు కాబట్టి నన్ను ఎక్కువగా అడగకండి. త్వరలోనే గీతూ మోహన్‌దాస్ ఓ ప్రకటన చేస్తారు. అప్పటివరకు వేచి చూడండి’’ అని పేర్కొన్నారు. ఇక నయనతార గురించి దర్శక–నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment