యశ్‌ ‘ టాక్సిక్‌ ’లో ముగ్గురు భామలు.. కరీనా ప్లేస్‌లో నయనతార! | Nayanthara, Kiara Advani, Huma Qureshi To Act In Yash's Toxic Movie | Sakshi
Sakshi News home page

యశ్‌ ‘ టాక్సిక్‌ ’లో ముగ్గురు భామలు.. కరీనా ప్లేస్‌లో నయనతార!

Published Sun, Jun 16 2024 8:05 AM

Nayanthara, Kiara Advani, Huma Qureshi To Act In Yash Toxic Movie

తమిళసినిమా: కేజీఎఫ్‌ చిత్రం తరువాత ఆ చిత్ర కథానాయకుడు నటించే చిత్రం అంటే ఆ రేంజ్‌కు ఏమాత్రం తగ్గకూడదు. ఎందుకంటే అంత ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయి మరి. నటుడు యష్‌ అలాంటి జాగ్రత్తలే తీసుకుంటున్నారనిపిస్తోంది. కేజీఎఫ్‌ 1, 2 చిత్రాల తరువాత ఈయన టాక్సిక్‌ అనే చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందనున్న ఈ పాన్‌ ఇండియా చిత్రానికి మహిళా దర్శకురాలు గీతు మోహన్‌దాస్‌ తెరకెక్కించనున్నారు. దీంతో చిత్రంలో మల్టీ భాషలకు చెందిన ప్రముఖ తారాగణం నటించనున్నారు. 

ముఖ్యంగా బీబీసీ సీరీస్‌ పిక్కీ బ్‌లైండర్స్‌ తరహాలో తెరకెక్కనున్న ఈ గ్యాంగ్‌స్టర్స్‌ కథా చిత్రంలో యష్‌ సరసన కియారా అద్వానీ నాయకిగా నటించనున్నారు. మరో ప్రధాన పాత్రలో కరీనాకపూర్‌ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆమె పాత్రలో నయనతార వచ్చి చేరినట్లు తెలిసింది. ఇందులో ఈమె యష్‌కు సిస్టర్‌గా నటించనున్నట్లు సమాచారం. అదేవిధంగా మరో బాలీవుడ్‌ భామ హ్యూమా ఖురేషి కీలక పాత్రను పోషించనున్నారని తెలిసింది. 

మరో విషయం ఏమిటంటే దర్శకురాలు ఈ చిత్ర షూటింగ్‌ను 200 రోజుల్లో పూర్తిచేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. అందులో 150 రోజులు లండన్‌ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించనున్నట్లు సమాచారం. అందుకోసం చిత్ర యూనిట్‌ త్వరలో యూకేకు బయలుదేరనున్నట్లు తెలిసింది. ఇకపోతే ఈ చిత్రాన్ని 2025, ఏప్రిల్‌ 10వ తేదీన తెరపైకి తీసుకురావాలని నిర్ణయించనట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement