
‘కేజీఎఫ్: చాప్టర్ 1, కేజీఎఫ్: చాప్టర్ 2’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు హీరో యశ్(yash). ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్(toxic): ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్’. గీతూ మోహన్ దాస్ దర్శకుడు. కేవీఎన్ ప్రొడక్షన్స్, యశ్ మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్పై వెంకట్ కె.నారాయణ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాని కన్నడతో పాటు గ్లోబల్ ఆడియన్స్ కోసం ఇంగ్లిష్‌లోనూ చిత్రీకరిస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.
గీతూ మోహన్ దాస్ మాట్లాడుతూ– ‘‘విభిన్న భాషా, సాంస్కృతిక నేపథ్యంలో రాబోతున్న ‘టాక్సిక్’ మూవీని అన్ని భాషల, ప్రాంతాల ప్రేక్షకులు ఆస్వాదించేలా రూపొందిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఇంగ్లిష్‌లో చిత్రీకరిస్తున్న మొదటి భారతీయ చిత్రంగా ‘టాక్సిక్’ రికార్డుల్లోకి ఎక్కింది. మా సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లోకి డబ్ అవుతుంది’’ అని వెంకట్ కె.నారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment