
తమిళ సినిమా: ప్రస్తుతం నెటిజన్లకు నటి రష్మిక మందన్నా టార్గెట్ అయ్యారు. శాండల్ వుడ్ నుంచి బాలీవుడ్ వరకు సూపర్ ఎక్స్‌ప్రెస్ లా పరుగులు తీస్తున్న ఈ అమ్మడు ఇటీవల విమర్శల వలలో చిక్కుకున్నారు. కన్నడలో ఘన విజయం సాధించిన కాంతార చిత్రం విషయంలో రష్మిక మాటలు తీవ్ర వివాదాస్పదం కావడమే ఇందుకు కారణం. ఒక దశలో కన్నడ చిత్ర పరిశ్రమ రష్మికను బ్యాన్ చేసిందనే ప్రచారం మీడియాలో హోరెత్తింది.
అంతే కాకుండా సొంత ఊరు మంగుళూరు వెళ్లడానికి కూడా భయపడుతోందని, దీంతో హైదరాబాద్, ముంబయ్‌లోనే మకాం పెట్టిందనే ప్రచారం సాగింది. దీంతో రష్మిక దిగొచ్చింది. తాను షూటింగ్‌లతో బిజీగా ఉండడంతో కాంతార చిత్రాన్ని చూడలేక పోయానని, ఇటీవల చిత్రాన్ని చూసి చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలిపానని వివరణ ఇచ్చింది. అదే విధంగా తనను కన్నడ చిత్ర పరిశ్రమ బ్యాన్ చేసిందనే ప్రచారం అవాస్తవమని స్పష్టం చేసింది.
మంచి అవకాశం వేస్తే కన్నడ చిత్రంలో నటించడానికి తాను సిద్ధమని చెప్పింది. ఇకపోతే తనను అగౌరపరచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. విమర్శలను పట్టించుకోవడం మానేశానని పేర్కొంది. ప్రస్తుతం విజయ్ సరసన నటిస్తున్న వారీసు చిత్రం రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment