‘‘కన్నడ పరిశ్రమ నుంచి కొందరు నిర్మాతలు నన్ను బ్యాన్ చేశారని ప్రచారమవుతున్న వార్తలు అవాస్తవం. ఇప్పటివరకు నా వద్దకు అలాంటి విషయాలేవీ రాలేదు’’ అని రష్మికా మందన్నా అన్నారు. గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న రష్మిక మాట్లాడుతూ – ‘‘కన్నడ సినిమాలపైన ఎప్పటికీ నాకు ప్రేమ ఉంటుంది. వాస్తవాలు తెలియకుండా దుష్ప్రచారం చేస్తున్నారు.
‘కాంతారా’ రిలీజైన రెండు రోజులకే ఆ సినిమా గురించి అడగడంతో చూడలేదు కాబట్టి సరిగ్గా స్పందించలేదు (ఈ విషయంపై రష్మికను ట్రోల్స్ చేశారు). ఆ తర్వాత చూసి, ఆ చిత్రబృందానికి మెసేజ్ చేశాను. వారు థ్యాంక్యూ అని రిప్లై ఇచ్చారు. నా వ్యక్తిగత విషయాలను కెమెరా పెట్టి ప్రపంచానికి చూపించలేను. అయినా నా వ్యక్తిగత విషయాలు ప్రపంచానికి అనవసరం. వృత్తిపరంగా నా సినిమాల గురించి చెప్పడం నా బాధ్యత. నా పై కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. వారి విఙ్ఞతకే వదిలేస్తున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment