Kannada movies
-
ఒకప్పుడు ఫేమస్ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఐఏఎస్‌గా..
సినిమాల మీద పిచ్చితో ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి వచ్చినవాళ్లను చూశాం.. అలాగే ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో సినిమాలు వదిలేసి రోడ్డునపడ్డవాళ్లమూ చూశాం.. కానీ ఇక్కడ చెప్పుకునే ఓ మహిళ మాత్రం చిన్న వయసులో సినిమాలు చేసింది. ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టి ఐఏఎస్ సాధించింది. బాలనటిగా బోలెడు సినిమాలు.. ఆవిడే హెచ్ఎస్ కీర్తన.. బాల్యంలో నటనతో అందరినీ కట్టిపడేసింది. అటు బుల్లితెర, ఇటు వెండితెర.. రెండింటిపైనా తళుక్కుమని మెరిసింది. కన్నడలో సీరియల్స్‌తో పాటు సినిమాలు చేసింది. కర్పూరద గోంబే, గంగ-యమున, ముద్దిన అలియ, ఉపేంద్ర, ఎ, కనూర్ హెగ్గడటి, సర్కిల్ ఇన్స్పెక్టర్, ఓ మల్లిగె, లేడీ కమిషనర్, హబ్బ, డోరె, సింహాద్రి, జనని, చిగురు, పుతని ఏజెంట్.. ఇలా పలు చిత్రాల్లో బాలనటిగా మెప్పించింది. ఆరో ప్రయత్నంలో.. రానురానూ తనకు చదువుపై మక్కువ ఎక్కువైంది. ఎలాగైనా ఐఏఎస్ అవ్వాలనుకుంది, ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం దేశంలోనే అతి క్లిష్టమైన పరీక్షల్లో ఒకటైన యూపీఎస్సీ ఎగ్జామ్ రాసింది. కానీ ఫెయిలైంది. అయినా మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేసింది. వరుసగా రాస్తూనే ఉంది. అలా ఆరోసారి(2020లో) పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఆలిండియా లెవల్లో 167వ ర్యాంకు సంపాదించింది. కర్ణాటకలోని మాండ్యా జిల్లా అసిస్టెంట్ కమిషనర్‌గా అపాయింట్ అయింది. రెండేళ్లు ఆ పని చేశాక ఐఏఎస్ అయితే దీనికంటే ముందు 2011లో ఆమె కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎగ్జామ్(KAS) కూడా రాసింది. ఈ పరీక్షలో పాస్ అవడంతో పాటు ఉద్యోగం కూడా సాధించింది. రెండేళ్లపాటు కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిణిగా సేవలందించింది. ఆ తర్వాత ఐఏఎస్ జాబ్ కొట్టింది. మొదటి ప్రయత్నంలోనే ఫెయిలయ్యామని చతికిలపడేవారికి కీర్తన స్టోరీ ఒక ఇన్స్పిరేషన్ అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు! చదవండి: చులకన, వేధింపులు.. చాలా ఏళ్లు బాధపడ్డా.. ఇకపై అస్సలు ఊరుకోను! -
60వ దశకం నుంచే కన్నడ భామల హల్చల్
-
Rashmika Mandanna: నన్నెవ్వరూ బ్యాన్ చేయలేదు
‘‘కన్నడ పరిశ్రమ నుంచి కొందరు నిర్మాతలు నన్ను బ్యాన్ చేశారని ప్రచారమవుతున్న వార్తలు అవాస్తవం. ఇప్పటివరకు నా వద్దకు అలాంటి విషయాలేవీ రాలేదు’’ అని రష్మికా మందన్నా అన్నారు. గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న రష్మిక మాట్లాడుతూ – ‘‘కన్నడ సినిమాలపైన ఎప్పటికీ నాకు ప్రేమ ఉంటుంది. వాస్తవాలు తెలియకుండా దుష్ప్రచారం చేస్తున్నారు. ‘కాంతారా’ రిలీజైన రెండు రోజులకే ఆ సినిమా గురించి అడగడంతో చూడలేదు కాబట్టి సరిగ్గా స్పందించలేదు (ఈ విషయంపై రష్మికను ట్రోల్స్ చేశారు). ఆ తర్వాత చూసి, ఆ చిత్రబృందానికి మెసేజ్ చేశాను. వారు థ్యాంక్యూ అని రిప్లై ఇచ్చారు. నా వ్యక్తిగత విషయాలను కెమెరా పెట్టి ప్రపంచానికి చూపించలేను. అయినా నా వ్యక్తిగత విషయాలు ప్రపంచానికి అనవసరం. వృత్తిపరంగా నా సినిమాల గురించి చెప్పడం నా బాధ్యత. నా పై కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. వారి విఙ్ఞతకే వదిలేస్తున్నాను’’ అన్నారు. -
రాజ్‌కుమార్ ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్
దివంగత ప్రముఖ కన్నడ నటులు రాజ్‌కుమార్ మనవరాలు, కన్నడ యాక్టర్ రామ్‌కుమార్, పూర్ణిమ (రాజ్‌కుమార్ కూతురు)ల తనయ ధన్యా రామ్‌కుమార్ హీరోయిన్గా పరిచయం కానున్నారు. కన్నడ చిత్రం ‘నిన్నా సానిహకే’లో హీరోయిన్గా నటించారు ధన్య. కోవిడ్ వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఈలోపు కోలీవుడ్ నుంచి కాల్స్ అందుకుంటున్నారట ధన్య. ఇదిలా ఉంటే.. రాజ్‌కుమార్ కుటుంబం నుంచి చిత్రపరిశ్రమలోకి వస్తున్న తొలి హీరోయిన్ ధన్యా రామ్కుమార్నే కావడం విశేషం. ఈ సందర్భంగా ధన్య మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీలోకి రావాలని ఆశపడే నా కుటుంబానికి చెందిన అమ్మాయిలకు, బయటివారికి నేనొక ఉదాహరణగా నిలవాలనుకుంటున్నాను. కారణాలు ఏమైనా మా ఫ్యామిలీ మహిళలు సినిమాల్లోకి రాలేదు. మా తాతగారు (రాజ్‌కుమార్) ఒప్పుకోకపోవడం వల్లే అని కొందరు అంటున్నారు. కానీ ఈ విషయం గురించి మా అమ్మని అడిగితే, ఏవో భద్రతాపరమైన కారణాలు అన్నట్లుగా చెప్పారు. ఇప్పుడు ‘మీటూ’ అంటూ నిర్భయంగా మాట్లాడుతున్నట్లు అప్పట్లో నటీమణులకు స్వేచ్ఛగా మాట్లాడే వీలు లేకపోయి ఉండొచ్చు. కానీ మా తాతగారు ఇప్పుడుంటే ఇండస్ట్రీలో వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకుని నేను హీరోయిన్గా చేయడానికి ఒప్పుకునేవారు’’ అన్నారు. -
నటి రాధికా కుమారస్వామి రీ ఎంట్రీ
బెంగళూరు : కన్నడ నటి రాధికా కుమారస్వామి సినీరంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రాధికా కుమారస్వామి..కన్నడ నటుడు రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న రాజేంద్రపొన్నప్ప అనే చిత్రంలో కథాయినాయికగా ఎంపికై ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దాదాపు పదకొండేళ్ల తరువాత రవిచంద్రన్, రాధికా కుమారస్వామిలు జంటగా మళ్లీ తెరపైన కనిపించబోతున్నారు. రవిచంద్రన్ స్వతహాగా రాసిన కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తూ తానే దర్శకత్వం వహిస్తున్నారు. ఈశ్వరి ప్రోడక్షన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభిచనున్నట్లు రవిచంద్రన్ తెలిపారు. ఛాయగ్రహకుడుగా జి.ఎస్.వి. సీతారామ్, సంగీత దర్శకుడుగా గౌతమ్‌శ్రీవత్సవ్ సహకారం అందజేయనున్నారు. కాగా కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని రాధిక పెళ్లాడిన సంగతి తెలిసిందే. అప్పటికే పెళ్లయిన కుమార స్వామిని ఆమె రెండో వివాహం చేసుకున్నారు. కుమారస్వామి గతంలో సినిమా రంగంలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా పని చేసిన సమయంలో రాధికతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కూతురు కూడా ఉంది. -
సినీ పరిశ్రమలో మరో విషాదం!
లెజండరీ నటుడు రాజ్‌కుమార్ సతీమణి కన్నుమూత బెంగళూరు: ప్రఖ్యాత దర్శకుడు దాసరి నారాయణరావు కన్నుమూయడంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకొనగా.. అటు కన్నడ చిత్ర పరిశ్రమలోనూ విషాదం నెలకొంది. లెజండరీ నటుడు, కన్నడ కంఠీరవం రాజ్‌కుమార్ సతీమణి పార్వతమ్మ రాజ్‌కుమార్ బుధవారం తుదిశ్వాస విడిచారు. కిడ్నీ, శ్వాసకోశ సమస్యలతో ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం తెల్లవారుజామున 4.40 గంటలకు కన్నుమూశారు. 78 ఏళ్ల పార్వతమ్మ ఆరోగ్యం విషమించడంతో ఈ నెల 14న ఆస్పత్రిలో చేరింది. అప్పటినుంచి వెంటిలేటర్ మీద ఉన్న ఆమెకు వైద్యులు ప్రత్యేక శస్త్రచికిత్సలు నిర్వహించినా లాభం లేకపోయింది. పూర్ణ ప్రంగ వాటికలో ఆమె భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. భర్త రాజ్‌కుమార్ తరహాలోనే పార్వతమ్మ కూడా తన రెండు కళ్లను దానం చేశారు. రాజ్‌కుమార్-పార్వతమ్మ దంపతులకు మొత్తం ఐదుగురు సంతానం. వీరి తనయులైన పునీత్ రాజకుమార్, శివరాజ్‌కుమార్ ప్రస్తుతం కన్నడ అగ్ర హీరోలుగా ఉన్నారు. నిర్మాతగా కూడా పార్వతమ్మ తనదైన ముద్ర వేశారు. ఆమె అప్పు, అరసు, వంశీ, హుడుగారు, అభి వంటి సినిమాలను తెరకెక్కించారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసుకున్నారు. ఆమె కుటుంబానికి పలువురు కన్నడ సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.