![Sandalwood Director Kiran Govi Passed Away With Heart Attack - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/25/kiran.jpg.webp?itok=VDzW6QXH)
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కన్నడ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. డైరెక్టర్ కిరణ్ గోవి(53) గుండెపోటుతో మరణించారు. ఈ రోజు తన ఆఫీసులోనే గుండెపోటుకు గురి కాగా.. ఆయన సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ డైరెక్టర్ కన్నుమూశారు. దీంతో శాండల్‌వుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ఆయన ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. సంచారి, పయన, పారు వైఫ్ ఆఫ్ దేవదాస్, యారిగే యారింటు లాంటి కన్నడ చిత్రాలను ఆయన దర్శకత్వంలో తెరకెక్కించారు. ఆయన తెలుగు చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. టాలీవుడ్‌లో తిరుగుబోతు అనే మూవీని తెరకెక్కించారు. కిరణ్ మృతి చెందిన విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment