సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ దర్శకుడు సీవీ శివశంకర్(90) కన్నుమూశారు. కన్నడలో రచయితగా పలు చిత్రాలకు సినీ గీతాలు అందించారు. ఆయనకు గుండెపోటు రావడంతో జూన్ 27న బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు వెంకట్ భరద్వాజ్ వెల్లడించారు. ఆయన మృతి పట్ల కన్నడ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
(ఇది చదవండి: మొదటి ముద్దు.. డెటాల్‌తో నోరు కడుక‍్కున్నా: ప్రముఖ నటి)
1962లో తన కెరీర్‌ను ప్రారంభించిన శివశంకర్.. మంజరి చిత్రంలో నటుడిగా, సహాయ దర్శకుడిగా పనిచేశాడు. 1967లో పదవీధార అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత 1968లో ‘నమ్మ ఊరు’ అనే మరో చిత్రానికి దర్శకత్వం వహించారు. అదే ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం. ఆ తర్వాత డైరెక్షన్‌కు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత శివశంకర్ కన్నడలో అనేక పాటలకు సాహిత్యం అందించారు. బెంగుళూరు నగారా, సిరివంతనాదరూ కన్నడ నాదల్లె మెరెవే, ఆనందదా తవరూరు వంటి అనేక పాటలు రాశారు.
కాగా.. ఆయనకు భార్య రాధమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన కుమారుల్లో ఒకరైన వెంకట్ భరధ్వాజ్ కూడా సినిమా రంగంలో ఉన్నారు. వెంకట్ రెండు సినిమాల్లో కలిసి పనిచేశారు. శివశంకర్‌ను కన్నడ ప్రభుత్వం కర్ణాటక రాజ్యోత్సవ అవార్డుతో సత్కరించింది.
(ఇది చదవండి: ఇప్పుడే బ్రేక్ ఫాస్ట్ కూడా చేశా.. విడాకులపై గజినీ హీరోయిన్!)
Comments
Please login to add a commentAdd a comment