
జాలువారుతున్న జలపాతం
బట్రేపల్లి జలపాతం బాహుబలి సెట్టింగ్‌ను తలపిస్తోంది. కొండ పైనుంచి బండల మీదుగా నీరు కిందికి జాలవారుతూ సందర్శకులను కనువిందు చేస్తోంది. కొండపై నుంచి నీళ్లొస్తున్నాయని తెలుసుకున్న ప్రజలు జలకాలాడుతూ సంబర పడిపోతున్నారు. యువత సాహొరే.. బాహుబలి అంటూ కేరింతలు కొడుతోంది. ఆదివారం సెలవు కావడంతో జలపాతాన్ని చూసేందుకు మరింత మంది వచ్చే అవకాశాలు లేకపోలేదు. మరో నాలుగురోజుల పాటు అడపాదడపా వర్షాలు కురిస్తే దసరా సెలవుల్లో బట్రేపల్లి జలపాతానికి సందర్శకుల తాకిడి మరింత పెరిగవచ్చు. సెప్టెంబర్ మొదటివారంలో మొదలై మూడు, నాలుగు రోజులపాటు జాలువారిన తలుపుల మండలం బట్రేపల్లి జలపాతం శనివారం మళ్లీ మొదలైంది. ఇటీవల కురిసిన వర్షాలకు బట్రేపల్లి అడవుల్లో నీటిఊట ప్రారంభమైంది. అది పాయలు పాయలుగా ఇక్కడకు చేరి జలపాతమైంది.
- కదిరి