సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేధస్సు వినియోగం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘సాగు బాగు ప్రాజెక్టు’ తొలి దశ నివేదికను తమిళనాడు ఐటీ శాఖ మంత్రి డాక్టర్ పళనివేల్ త్యాగరాజన్‌తో కలిసి కేటీఆర్ శుక్రవారం విడుదల చేశారు
.డేటా ఆధారిత సలహాలు, మార్కెట్ ఇంటెలిజెన్స్ తదితరాల ద్వారా రైతాంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు వెల్లడించారు. కృత్రిమ మేధస్సుతో పాటు ఇతర అత్యాధునిక సాంకేతికతలను ఉపయో గించుకుంటూ భారత్‌లో వ్యవసాయ రంగంలో మార్పులు తెచ్చే లక్ష్యంతో ‘సాగు బాగు’ ప్రాజెక్టును అమలు చేస్తున్నామన్నారు.
ఖమ్మంలో మిరప రైతులకు ’సాగు బాగు’
‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్’ (ఏఐ4ఏఐ) నినాదంతో రాష్ట్ర ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. 2022లో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో మూడు స్టార్టప్‌ల భాగస్వామ్యంతో అమలుచేస్తున్నారు. సాగు బాగులో భాగంగా ఖమ్మం జిల్లాలో 7వేలమందికి పైగా మిరప రైతులు వ్యవసాయ సాంకేతిక సేవలు, ఏఐ ఆధారిత సలహాలు పొందారు. కాగా శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ డైరక్టర్ రమాదేవి లంకా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment