సాక్షి, గుంటూరు: పులిచింతల ప్రాజెక్టు వద్ద అధికారులు మరమ్మతులు చేపట్టారు. 16వ నంబర్ గేట్ వద్ద నిపుణుల ఆధ్వర్యంలో మరమ్మతులు కొనసాగుతున్నాయి. సాగర్, తుపాకులగూడెం, పోలవరం నుంచి నిపుణులు వచ్చారు. 35 మంది సిబ్బంది మరమ్మతు పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రాజెక్ట్ వద్ద స్టాప్ లాక్ గేట్ అమర్చే పనిలో సిబ్బంది ఉన్నారు.
పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకోవడంతో గురువారం తెల్లవారుజామున నీటిని దిగువకు విడుదల చేసేందుకు గేట్లు ఎత్తుతుండగా 16వ గేటు ప్రమాదవశాత్తు విరిగిపోయిన సంగతి తెలిసిందే. రెండు అడుగుల మేర గేట్లు ఎత్తడానికి అధికారులు ప్రయత్నిస్తుండగా హైడ్రాలిక్ గడ్డర్ ఊడిపోవడంతో గేటు విరిగి వరద నీటిలో కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న ప్రాజెక్టు ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ నిన్న ఉదయాన్నే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. నిపుణుల బృందాన్ని రప్పించి మరమ్మతులు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment