మన దేశమంతా ఆగస్టు 23 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అదేరోజు చంద్రయాన్-3 చంద్రుని ఉపరితంపై ల్యాండ్ కానుంది. చంద్రయాన్-3 ఆర్థిక బడ్జెట్ 615 కోట్ల రూపాయలు(75 మిలియన్ డాలర్లు) 2023, జూలై 14న చంద్రయాన్-3 లాంచ్ బటన్‌ను నొక్కారు. అప్పటి నుండి చంద్రయాన్-3 చంద్రుని ఉపరితలంపైకి ఎప్పుడు ల్యాండ్ అవుతుందా అని భారతదేశమంతా ఎదురుచూస్తోంది.
పలువురు నెటిజన్లు చంద్రయాన్-3 బడ్జెట్‌ను కొన్ని హాలీవుడ్ సినిమాల బడ్జెట్‌తో పోలుస్తున్నారు. 2009లో విడుదలైన హాలీవుడ్ చిత్రం అవతార్ బడ్జెట్ దాదాపు రూ.1970 కోట్లు. చంద్రయాన్-3 మొత్తం బడ్జెట్ రూ.615 కోట్లు. అంటే అవతార్ సినిమా ఖర్చులోని మూడో వంతు మొత్తంతో చంద్రయాన్-3ని చంద్రునిపైకి పంపడంలో భారత్ విజయం సాధించిందని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు.
అలాగే హాలీవుడ్ సినిమా ఇంటర్‌స్టెల్లర్‌కు 165 మిలియన్ల డాలర్లు ఖర్చుకాగా, చంద్రయాన్ 75 మిలియన్ డాలర్లతోనే విజయం సాధించిందని అంటున్నారు. రూ. 615 కోట్లు అంటే భారత్‌కు భారీ మొత్తమేనని పలువురు పేర్కొంటున్నారు. ఇది శాస్త్రవేత్తలు సాధించిన ఘన విజయం అని కొందరు, వారి నాలుగేళ్ల శ్రమ వృథాగా పోలేదని మరికొందరు అంటున్నారు. శాస్త్రవేత్తల కృషికి సెల్యూట్ అని, శాస్త్రపరిశోధనలకు భారతదేశం మరింతగా ఖర్చు చేయాలని యూజర్లు సలహా ఇస్తున్నారు.
కొందరు యూజర్లు చంద్రయాన్-3 ప్రాజెక్టును సినిమాల నిర్మాణ వ్యయంతో పోల్చడం సరికాదని అన్నారు. భారతీయులు వ్యయ నియంత్రణతో ఈ ప్రాజెక్టు చేపట్టారని, చంద్రయాన్ ప్రయోగం ప్రతీ భారతీయునికి గర్వకారణమని మరికొందరు అంటున్నారు.
ఇది కూడా చదవండి: అది రహస్య కుటుంబం.. 40 ఏళ్లుగా దట్టమైన అడవుల్లోనే ఉంటూ..
Kinda crazy when you realize India's budget for Chandrayaan-3 ($75M) is less than the film Interstellar ($165M)😯🚀 #Chandrayaan3 #moonlanding pic.twitter.com/r2ejJWbKwJ
— Newsthink (@Newsthink) August 21, 2023
Comments
Please login to add a commentAdd a comment