బాలానగర్‌లో అతిపెద్ద గేటెడ్‌ కమ్యూనిటీ  | Realestate Raghuram A2A Homeland in Balanagar | Sakshi

బాలానగర్‌లో అతిపెద్ద గేటెడ్‌ కమ్యూనిటీ 

May 27 2023 10:18 AM | Updated on May 27 2023 10:22 AM

Realestate Raghuram A2A Homeland in Balanagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిర్మాణ రంగంలో మూడున్నర దశాబ్దాల అనుభవం కలిగిన రఘురామ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌  మరో అద్బుతమైన ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే బాలానగర్‌లో ఏ2ఏ లైఫ్‌ స్పేసెస్‌ అపార్ట్‌మెంట్, సెంటర్‌ మాల్‌ ప్రాజెక్ట్‌లను విజయవంతంగా పూర్తి చేసిన సంస్థ.. తాజాగా ఏ2ఏ హోమ్‌ ల్యాండ్‌ ప్రీమియం అపార్ట్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది. బాలానగర్‌లోనే అతిపెద్ద గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ ఇదేనని కంపెనీ తెలిపింది. రఘురామ్‌ ఇన్‌ఫ్రా ఇప్పటివరకు 40 లక్షలకు పైగా చ.అ.లలో 38 పైగా ప్రాజెక్ట్‌లను నిర్మించింది. సుమారు 4 వేలకు పైగా కస్టమర్లున్నారు. 

ఫేజ్‌–1లో 12 ఎకరాలలో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 7 బ్లాకులుంటాయి. మొత్తం 1,158 ఫ్లాట్లుంటాయి. అన్నీ త్రీ బీహెచ్‌కే ప్రీమియం ఫ్లాట్లే. 1,700 చ.అ. నుంచి 2,260 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి.  (ఈస్ట్‌ హైదరాబాద్‌ రయ్‌ రయ్‌! ఎందుకో తెలుసా?)

► ఈ ప్రాజెక్ట్‌లో 93 వేల చ.అ. విస్తీర్ణంలో రెండు క్లబ్‌హౌస్‌లతో పాటు క్రచ్, ఇండోర్‌ గేమ్స్, లెర్నింగ్‌ సెంటర్, బిజినెస్‌ లాంజ్, గెస్ట్‌ రూమ్స్, మల్టీపర్పస్‌ హాల్, స్విమ్మింగ్‌ పూల్, కిడ్స్‌ ప్లే ఏరియా, లైబ్రరీ, జిమ్, బ్యాడ్మింటన్‌ కోర్టు, యోగా సెంటర్‌ వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. 

► బాలానగర్‌ మెట్రో జంక్షన్, కూకట్‌పల్లి వై జంక్షన్‌లకు కూతవేటు దూరంలో ఈ ప్రాజెక్ట్‌ ఉంటుంది. ప్రధాన నగరంలో ఉండటంతో ఇంటర్నేషనల్‌ స్కూళ్లు, ఆసుపత్రులు, షాపింగ్‌ మాల్స్‌ వంటి వాటికి కొదవే లేదు. (మరో సంచలనం: బ్రెయిన్‌ చిప్‌, మస్క్‌కు గ్రీన్‌ సిగ్నల్‌)

మరిన్ని  రియల్‌ ఎస్టేట్‌ వార్తలకు,బిజినెస్‌ అప్‌డేట్స్‌ కోసం  చదవండి సాక్షి బిజినెస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement