Foxconn Withdraws JV With Vedanta Semiconductor Project in India - Sakshi
Sakshi News home page

Foxconn: ఫాక్స్‌కాన్ సంచలన నిర్ణయం: లక్షల కోట్ల ప్రాజెక్ట్‌ నుంచి వెనక్కి

Published Mon, Jul 10 2023 8:38 PM | Last Updated on Mon, Jul 10 2023 8:48 PM

Foxconn withdraws JV with Vedanta semiconductor project in India - Sakshi

తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్  ఫాక్స్‌కాన్ సంచలన నిర్ణయం తీసుకుంది.  దేశీయ  మెటల్స్-టు-ఆయిల్‌ వేదాంత కంపెనీతో 19.5 బిలియన్ డాలర్ల సెమీ కండక్టర్ జాయింట్ వెంచర్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ఫాక్స్‌కాన్  నిర్ణయించుకున్నట్టు తెలిపింది. ఈ మేరకు సంస్థ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది దీనికి గల కారణాలను వివరించలేదు.  (మ్యారేజ్‌ డే ఏమోగానీ,  24 లక్షల ఉబెర్‌ బిల్లు చూసి గుడ్లు తేలేసిన జంట)

గ్లోబల్ కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఫాక్స్‌కాన్ , వేదాంత గత ఏడాది గుజరాత్‌లో సెమీకండక్టర్. డిస్‌ప్లే ప్రొడక్షన్ ప్లాంట్‌లను నిర్మించడానికి సుమారు రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి  తెలిసిందే.  కానీ ప్రాజెక్ట్‌పై ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పనిచేసినప్పటికీ ఈ జాయింట్‌ వెంచర్‌ను ముగించాలని ఇరుపక్షాలు పరస్పరం నిర్ణయించుకున్నాయన్న తాజా ప్రకటన సంచలనం రేపుతోంది. ఆ కంపెనీతో ఫాక్స్‌కాన్‌కు ఎలాంటి సంబంధం లేదని, భవిష్యత్‌లో భాగస్వాములు ఎలాంటి గందరగోళానికి గురవ్వకుండా ఒరిజినల్ పేరునే కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు హోన్ హయ్ టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్‌కాన్) ప్రకటించింది. ఈ ఒప్పందం 'మేక్ ఇన్ ఇండియా' పుష్‌కు ఖచ్చితంగా ఎదురుదెబ్బ అని కౌంటర్‌పాయింట్‌లోని రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నీల్ షా  వ్యాఖ్యానించారు. (ITR Filing: గడువు సమీపిస్తోంది! ఐటీ రిటర్న్స్‌ ఫైలింగ్‌ జాగ్రత్తలు, లాభాలు)

కాగా 2026 నాటికి సెమీకండక్టర్ మార్కెట్ విలువ 63 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేస్తున్న కేంద్రం, గతేడాది 10 బిలియన్ డాలర్ల ప్రోత్సాహక పథకం కింద ప్లాంట్ల ఏర్పాటుకు మూడు దరఖాస్తులు అందుకుంది. ఇందలో వేదాంత-ఫాక్స్‌కాన్ జాయింట్ వెంచర్‌ ఒకటి,   సింగపూర్‌కు చెందిన IGSS వెంచర్స్ , టవర్ సెమీకండక్టర్‌ను టెక్ భాగస్వామిగా పరిగణించే గ్లోబల్ కన్సార్టియం ఐఎస్‌ఎంసీ నుండి వచ్చాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement