JV
-
బీఎండబ్ల్యూ, టాటా టెక్ జత
న్యూఢిల్లీ: ఆటో రంగ జర్మన్ దిగ్గజం బీఎండబ్ల్యూ గ్రూప్, దేశీ ప్రొడక్ట్ ఇంజనీరింగ్, డిజిటల్ సర్విసుల కంపెనీ టాటా టెక్నాలజీస్ చేతులు కలపనున్నాయి. తద్వారా ఆటోమోటివ్ సాఫ్ట్వేర్ అభివృద్ధిసహా.. దేశీయంగా ఐటీ డెవలప్మెంట్ హబ్‌కు తెరతీయనున్నట్లు సంయుక్తంగా వెల్లడించాయి. ఇందుకు భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశాయి. ప్రణాళికల్లో భాగంగా పుణే, బెంగళూరు, చెన్నైలలో ఐటీ అభివృద్ధి కేంద్రాలను నెలకొల్పనున్నట్లు పేర్కొన్నాయి. బెంగళూరు, పుణేలలో ప్రధాన అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించాయి. చెన్నైలో ఐటీ సొల్యూషన్ల బిజినెస్‌పై దృష్టి కేంద్రీకరించనున్నట్లు పేర్కొన్నాయి. అధీకృత సంస్థల అనుమతుల ఆధారంగా భాగస్వామ్యాన్ని కుదుర్చుకోనున్నట్లు వెల్లడించాయి. జేవీతో ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్‌ను అందించనున్నాయి. ఎస్‌డీవీ సొల్యూషన్లు జేవీ ప్రధానంగా బీఎండబ్ల్యూ గ్రూప్ ప్రీమియం వాహనాలకు సాఫ్ట్వేర్ ఆధారిత వాహన(ఎస్‌డీవీ) సొల్యూషన్లు సమకూర్చనుంది. అంతేకాకుండా ఐటీ బిజినెస్‌కు డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సొల్యూషన్లు సైతం అందించనుంది. సుమారు 100 ఇన్నోవేటర్లతో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సంయుక్త ప్రకటనలో బీఎండబ్ల్యూ, టాటా టెక్ వెల్లడించాయి. రానున్న కాలంలో వీలైనంత త్వరాగా ఈ సంఖ్యను నాలుగంకెలకు పెంచనున్నట్లు తెలియజేశాయి. సాఫ్ట్వేర్, ఐటీ కేంద్రాల బీఎండబ్ల్యూ గ్లోబల్ నెట్‌వర్క్‌లో జేవీ భాగంకానున్నట్లు పేర్కొన్నాయి. బీఎండబ్ల్యూ గ్రూప్‌తో చేతులు కలపడం ద్వారా ఆటోమోటివ్ సాఫ్ట్వేర్, డిజిటల్ ఇంజ నీరింగ్‌లో కస్టమర్లకు అత్యున్నత సొల్యూషన్లు అందించేందుకు కట్టుబడి ఉన్న విషయాన్ని తెలియజేస్తున్నట్లు టాటా టెక్ సీఈవో, ఎండీ వారెన్ హారిస్ పేర్కొన్నారు. టాటా టెక్‌తో భాగస్వామ్యం ఎస్‌డీవీ విభాగంలో పురోగతికి సహకరించనున్నట్లు బీఎండబ్ల్యూ గ్రూప్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ క్రిస్టోఫ్ గ్రోట్ తెలియజేశారు. -
ఫాక్స్‌కాన్ సంచలన నిర్ణయం: లక్షల కోట్ల ప్రాజెక్ట్ నుంచి వెనక్కి
తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ ఫాక్స్‌కాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశీయ మెటల్స్-టు-ఆయిల్ వేదాంత కంపెనీతో 19.5 బిలియన్ డాలర్ల సెమీ కండక్టర్ జాయింట్ వెంచర్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ఫాక్స్‌కాన్ నిర్ణయించుకున్నట్టు తెలిపింది. ఈ మేరకు సంస్థ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది దీనికి గల కారణాలను వివరించలేదు. (మ్యారేజ్ డే ఏమోగానీ, 24 లక్షల ఉబెర్ బిల్లు చూసి గుడ్లు తేలేసిన జంట) గ్లోబల్ కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఫాక్స్‌కాన్ , వేదాంత గత ఏడాది గుజరాత్లో సెమీకండక్టర్. డిస్ప్లే ప్రొడక్షన్ ప్లాంట్లను నిర్మించడానికి సుమారు రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కానీ ప్రాజెక్ట్‌పై ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పనిచేసినప్పటికీ ఈ జాయింట్ వెంచర్‌ను ముగించాలని ఇరుపక్షాలు పరస్పరం నిర్ణయించుకున్నాయన్న తాజా ప్రకటన సంచలనం రేపుతోంది. ఆ కంపెనీతో ఫాక్స్‌కాన్‌కు ఎలాంటి సంబంధం లేదని, భవిష్యత్‌లో భాగస్వాములు ఎలాంటి గందరగోళానికి గురవ్వకుండా ఒరిజినల్ పేరునే కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు హోన్ హయ్ టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్‌కాన్) ప్రకటించింది. ఈ ఒప్పందం 'మేక్ ఇన్ ఇండియా' పుష్‌కు ఖచ్చితంగా ఎదురుదెబ్బ అని కౌంటర్‌పాయింట్‌లోని రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నీల్ షా వ్యాఖ్యానించారు. (ITR Filing: గడువు సమీపిస్తోంది! ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ జాగ్రత్తలు, లాభాలు) కాగా 2026 నాటికి సెమీకండక్టర్ మార్కెట్ విలువ 63 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేస్తున్న కేంద్రం, గతేడాది 10 బిలియన్ డాలర్ల ప్రోత్సాహక పథకం కింద ప్లాంట్ల ఏర్పాటుకు మూడు దరఖాస్తులు అందుకుంది. ఇందలో వేదాంత-ఫాక్స్‌కాన్ జాయింట్ వెంచర్ ఒకటి, సింగపూర్‌కు చెందిన IGSS వెంచర్స్ , టవర్ సెమీకండక్టర్‌ను టెక్ భాగస్వామిగా పరిగణించే గ్లోబల్ కన్సార్టియం ఐఎస్ఎంసీ నుండి వచ్చాయి. -
భారత్‌లో జేవీలపై యాపిల్ ‘చైనా’ సంస్థల ఆసక్తి
న్యూఢిల్లీ: ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్‌కు సరఫరా చేసే చైనా సంస్థలు భారత్‌లోను తమ ప్లాంట్లను ఏర్పాటు చేయడంపై ఆసక్తిగా ఉన్నాయి. దేశీ కంపెనీలతో కలిసి జాయింట్ వెంచర్లను నెలకొల్పాలని భావిస్తున్నాయి. ఇందుకోసం అవి త్వరలోనే కేంద్రం అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. యాపిల్ ఇప్పటికే అనధికారంగా సరఫరాదారుల జాబితాను అందించిందని పేర్కొన్నాయి. ఆయా సంస్థలతో ఎలాంటి సమస్యలు లేనందున వాటి ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపే అవకాశం ఉన్నట్లు వివరించాయి. ప్రస్తుతం దాదాపు 5-7 శాతం యాపిల్ ఉత్పత్తుల తయారీ భారత్‌లో జరుగుతున్నాయి. -
జేవీకి.. ఫోర్డ్, మహీంద్రాల ‘టాటా’
న్యూఢిల్లీ, సాక్షి: దేశీయంగా భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేయాలన్న ప్రణాళికలకు తెరదించినట్లు తాజాగా ఆటో రంగ దిగ్గజాలు ఫోర్డ్ మోటార్, మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించాయి. కోవిడ్-19 నేపథ్యంలో గత 15 నెలలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న మార్పుల ప్రభావంతో జేవీ ఆలోచనను విరమించుకున్నట్లు రెండు కంపెనీలూ విడిగా తెలియజేశాయి. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే వ్యాపార వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకున్నట్లు ఫోర్డ్ మోటార్ ప్రతినిధి టీఆర్ రీడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. జేవీ ఏర్పాటుకు ఏడాది కాలంగా రెండు కంపెనీలూ ప్రణాళికలు వేస్తూ వచ్చాయి. ఇందుకు గడువు డిసెంబర్ 31తో ముగియనుండటంతో జేవీ ఆలోచనకు స్వస్తి చెప్పాయి. నిజానికి తొలి ప్రణాళికల ప్రకారం పెట్టుబడులకు సంబంధించి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం లేదా గడువును పెంచుకోవడం వంటివి చేపట్టవలసి ఉన్నట్లు ఆటో వర్గాలు తెలియజేశాయి. అయితే కోవిడ్-19 కారణంగా మారిన పరిస్థితులతో వెనకడుగు వేసినట్లు పేర్కొన్నాయి. (కార్ల మార్కెట్లో ఆ 5 కంపెనీలదే హవా) వర్ధమాన మార్కెట్లకు వర్ధమాన మార్కెట్లలో విక్రయించేందుకు వీలుగా చౌక వ్యయాలతో వాహనాల తయారీ కోసం ఫోర్డ్, ఎంఅండ్ఎం జేవీని ఏర్పాటు చేయాలని 2019లో ప్రణాళికలు వేశాయి. వీటిలో భాగంగా మూడు కొత్త యుటిలిటీ వాహనాలను అభివృద్ధి చేయాలని భావించాయి. మధ్యతరహా ఎస్యూవీ తయారీతో వీటిని ప్రారంభించాలని యోచించాయి. అంతేకాకుండా వర్ధమాన మార్కెట్లలో విక్రయించేందుకు వీలుగా ఎలక్ట్రిక్ వాహనాలను సైతం రూపొందించాలని ప్రణాళికలు వేశాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వాహన తయారీ ప్రణాళికలపై ఎలాంటి వివరాలనూ వెల్లడించలేమని రీడ్ స్పష్టం చేశారు. (యాపిల్ నుంచి సెల్ఫ్‌డ్రైవింగ్ కారు!) ఒత్తిడి పెరుగుతోంది మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాలు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీపై ఇటీవల పలు కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. అయితే వీటి అభివృద్ధికి వీలుగా ప్రత్యేకంగా నిధులను వెచ్చించవలసి ఉండటంతో పలు కంపెనీలపై ఒత్తిడి పెరుగుతున్నట్లు ఆటో రంగ నిపుణులు పేర్కొన్నారు. ఇందువల్లనే ఫ్రాన్స్ కంపెనీలు పీఎస్ఏ, ఫియట్ క్రిస్లర్ మధ్య విలీనానికి బాటలు పడినట్లు అభిప్రాయపడ్డారు. 2021 మార్చిలోగా ఈ రెండు కంపెనీల మధ్య 38 బిలియన్ డాలర్ల విలువైన విలీనం జరగనున్న విషయం విదితమే. కాగా.. మహీంద్రా, తదితర కంపెనీలతో జత కట్టడం ద్వారా వాహన తయారీలో వ్యయాలను తగ్గించుకోవాలని ఫోర్డ్ తొలుత భావించింది. తద్వారా ప్రపంచ స్థాయిలో 8 శాతం నిర్వహణ మార్జిన్లను సాధించాలని లక్ష్యాన్ని పెట్టుకుంది. అయితే ఈ వ్యూహాలను కొనసాగించనున్నట్లు రీడ్ తాజాగా స్పష్టం చేశారు. ఇందుకు దక్షిణాసియాలోని మరో కంపెనీపై జత కట్టే వీలున్నట్లు ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. -
మాగ్నెటి జేవీలో హీరో మోటోకు మెజారిటీ వాటా
న్యూఢిల్లీ: హీరో మోటోకార్ప్ కంపెనీ... ఇటలీ కంపెనీ మాగ్నెటి మారెల్లితో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్లో 60 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ జేవీ(హెచ్ఎంసీ ఎంఎం ఆటో లిమిటెడ్)లో 60 శాతానికి సమానమైన 17.49 లక్షల షేర్లను(రూ.10 ముఖ విలువ) కొనుగోలు చేశామని కంపెనీ బుధవారం తెలిపింది. అయితే ఆర్థిక వివరాలను కంపెనీ వెల్లడించలేదు. టూవీలర్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్స్‌ను, ఇతర విడిభాగాలను విక్రయించడం, పంపిణీ చేయడం లక్ష్యంగా ఈ జేవీ ఏర్పాటైంది.