న్యూఢిల్లీ: ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్‌కు సరఫరా చేసే చైనా సంస్థలు భారత్‌లోను తమ ప్లాంట్లను ఏర్పాటు చేయడంపై ఆసక్తిగా ఉన్నాయి. దేశీ కంపెనీలతో కలిసి జాయింట్ వెంచర్లను నెలకొల్పాలని భావిస్తున్నాయి. ఇందుకోసం అవి త్వరలోనే కేంద్రం అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
యాపిల్ ఇప్పటికే అనధికారంగా సరఫరాదారుల జాబితాను అందించిందని పేర్కొన్నాయి. ఆయా సంస్థలతో ఎలాంటి సమస్యలు లేనందున వాటి ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపే అవకాశం ఉన్నట్లు వివరించాయి. ప్రస్తుతం దాదాపు 5-7 శాతం యాపిల్ ఉత్పత్తుల తయారీ భారత్‌లో జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment