Supplier
-
భారత్‌లో జేవీలపై యాపిల్ ‘చైనా’ సంస్థల ఆసక్తి
న్యూఢిల్లీ: ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్‌కు సరఫరా చేసే చైనా సంస్థలు భారత్‌లోను తమ ప్లాంట్లను ఏర్పాటు చేయడంపై ఆసక్తిగా ఉన్నాయి. దేశీ కంపెనీలతో కలిసి జాయింట్ వెంచర్లను నెలకొల్పాలని భావిస్తున్నాయి. ఇందుకోసం అవి త్వరలోనే కేంద్రం అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. యాపిల్ ఇప్పటికే అనధికారంగా సరఫరాదారుల జాబితాను అందించిందని పేర్కొన్నాయి. ఆయా సంస్థలతో ఎలాంటి సమస్యలు లేనందున వాటి ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపే అవకాశం ఉన్నట్లు వివరించాయి. ప్రస్తుతం దాదాపు 5-7 శాతం యాపిల్ ఉత్పత్తుల తయారీ భారత్‌లో జరుగుతున్నాయి. -
భారత్‌కు చమురు సరఫరాలో రష్యానే టాప్
న్యూఢిల్లీ: భారత్‌కు అత్యధికంగా ముడిచమురు సరఫరా చేసే దేశాల జాబితాలో వరుసగా రెండో నెలా నవంబర్లోనూ రష్యా అగ్రస్థానంలో నిల్చింది. ఎనర్జీ ఇంటెలిజెన్స్ సంస్థ వర్టెక్సా గణాంకాల ప్రకారం రోజుకు 9.09 లక్షల బ్యారెళ్ల (బీపీడీ) ముడి చమురును సరఫరా చేసింది. అక్టోబర్‌లో ఎగుమతి చేసిన 9.35 లక్షల బీపీడితో పోలిస్తే ఇది కాస్త తక్కువే అయినా.. మిగతా దేశాల ద్వారా వచ్చిన క్రూడాయిల్‌తో పోలిస్తే అధికంగానే ఉంది. (గుడ్‌న్యూస్..ఈ ఐటీ కంపెనీలో కొలువులే కొలువులు) సాధారణంగా భారత్‌కు చమురు సరఫరా చేయడంలో ఇరాక్, సౌదీ అరేబియా అగ్రస్థానాల్లో ఉంటాయి. కానీ తాజాగా నవంబర్‌లో మాత్రం ఇరాక్ నుంచి 8.61 లక్షల బీపీడీ, సౌదీ అరేబియా నుండి 5.70 లక్షల బీపీడీ చమురు మాత్రమే దిగుమతయ్యింది. 4.05 లక్షల బీపీడీతో అమెరికా నాలుగో స్థానంలో ఉంది. భారత్‌కు రష్యా నుంచి చమురు ఎగుమతులు ఈ ఏడాది మార్చిలో కేవలం 0.2 శాతం స్థాయిలో ఉండేవి. (‘క్రోమా’ వింటర్ సీజన్ సేల్..బంపర్ ఆఫర్లు) కానీ ప్రస్తుతం భారత చమురు సరఫరాల్లో అయిదో వంతుకు పెరిగాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం దరిమిలా పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో భారత్‌కు రష్యా డిస్కౌంటు రేటుకే ముడి చమురును అందిస్తోంది. దీంతో ఇటీవలి కాలంలో రష్యా క్రూడాయిల్ దిగుమతులు గణనీయంగా పెరిగాయి. (ఎన్డీటీవీ బోర్డు: అదానీ గ్రూప్‌నకు 2 సీట్లు ఆఫర్) -
చమురు సరఫరాలో రష్యా టాప్
న్యూఢిల్లీ: గత నెల(అక్టోబర్)లో భారత్‌కు అత్యధిక స్థాయిలో ముడిచమురును సరఫరా చేసిన దేశంగా రష్యా నిలిచింది. తద్వారా కొన్నేళ్లుగా గరిష్ట స్థాయిలో ముడిచమురు సరఫరా చేస్తున్న సౌదీ అరేబియా, ఇరాక్లను వెనక్కు నెట్టింది. ఇంధన కార్గో పరిశీలక సంస్థ వోర్టెక్సా అందించిన వివరాల ప్రకారం అక్టోబర్‌లో రష్యా చరిత్రలోనే అత్యధికంగా 9,33,556 బ్యారళ్ల చమురును ఇండియాకు రవాణా చేసింది. మార్చితో ముగిసిన గతేడాది(2021–22)లో దేశీ చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 0.2 శాతం మాత్రమేకాగా.. తాజాగా ఈ వాటాను 22 శాతానికి పెంచుకోవడం గమనార్హం! దీంతో మొత్తం దేశీ చమురు దిగుమతుల్లో ఇరాక్ వాటా 20.5 శాతానికి, సౌదీ అరేబియా వాటా 16 శాతానికి పరిమితమయ్యాయి. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన విషయం విదితమే. దీంతో డిస్కౌంట్ ధరలో చమురు సరఫరాలకు రష్యా సిద్ధపడింది. ఇది భారత్‌కు రష్యా నుంచి చమురు సరఫరాలు పెరిగేందుకు కారణమైంది. అయితే భారత్ గతంలో అంటే 2021 డిసెంబర్లో రష్యా నుంచి రోజుకి 36,255 బ్యారళ్లను దిగుమతి చేసుకోగా.. ఇరాక్ నుంచి 1.05 మిలియన్ బ్యారళ్లు, సౌదీ అరేబియా నుంచి 9,52,665 బ్యారళ్లు అందుకుంది. ఆపై రష్యా నుంచి నెమ్మదిగా దిగుమతులు పెరుగుతూ వచ్చాయి. -
బిల్లు కట్టమంటే.. చెవి కొరికేశాడు!
మదనపల్లెలో దారుణం ఆస్పత్రి పాలైన సప్లయర్ మదనపల్లె క్రైం: తిన్న టిఫిన్‌కు బిల్లు చెల్లించమంటే ఏకంగా చెవి కొరికేశాడ్రా నాయనా..! అని లబోదిబోమంటూ ఓ సప్లయర్ ఆస్పత్రికి పరుగులు తీశాడు. ఈ ఘటన మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చేనేత నగర్లో నివాసం ఉంటున్న అశోక్(22) స్థానిక మార్కెట్‌యార్డు వద్ద ఓ హోటల్లో సప్లయర్‌గా పనిచేస్తున్నాడు. టిఫిన్ చేసేందుకు వచ్చిన అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు(40) కడుపునిం డా తిని బిల్లు కట్టకుండా వెళ్లిపోతుండగా గమనించి అడ్డుకున్నాడు. దీంతో ఆ కస్టమర్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఒక్కసారిగా.. దాడి చేశాడు. ఈ హఠాత్పరిణామానికి సప్లయర్ బిత్తరపోయాడు. అతడు తేరుకునేలోపే శ్రీనివాసులు అశోక్ చెవిని అమాంతం కొరికే శాడు. దీంతో బిల్లుకథ దేవుడెరుగు.. గగ్గోలు పెట్టడం అతడి వంతయ్యింది. సహచర సిబ్బంది అశోక్‌ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. ఒకటవ పట్టణపోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నా ఇడ్లీ విరిగి చట్నీలో పడేది ఎప్పుడు..?!
పెద్దయ్యాక ఏమవుతావు? అని నా చిన్నప్పుడు ఎవరైనా అడిగితే... హోటల్ సర్వర్నవుతాను అనేవాడిని. నా మనసులో సర్వర్ పట్ల బోల్డంత ఆరాధన భావం ఉంది. సర్వాంతర్యామి అనే పదానికి, సర్వరాంతర్యామి అనే పదానికీ ఎంతో దగ్గర పోలిక ఉంది. అందుకేనేమో... భగవంతుడిలాగే సర్వర్, బేరర్, వెయిటర్, సప్లయర్ అని ఎన్నో నామాలతో అన్నార్తులు ఆయనను పిలుచుకుంటారు. భగవంతుడు ఎన్నో లోకాలను తనలో కలిగి ఉన్నట్లే... ఎందరికో ఇవ్వాల్సిన ప్లేట్లను ఏకకాలంలో నైపుణ్యంగా నియంత్రిస్తుంటాడు సర్వరాంతర్యామి. భగవంతుడి చేతిలో ఉండే చక్రాయుధంతో పోలిన ప్లేటును ఆయనా నిత్యం ధరిస్తుంటాడు. అందుకే ఎవరైనా సర్వోత్తముడు అనే మాట వాడితే, నాకది సర్వరోత్తముడులాగే వినిపిస్తుంది. ‘ఓ పెసరా... రెండు ప్లేట్ వడ... ఏక్ చాయ్...’ అంటూ ఆర్డరు చెప్పడం సాహసోపేతమైన పని. అందుకే సర్వర్‌ను చాలా ఫాసినేటింగ్‌గా చూస్తుండేవాణ్ణి నేను. అలా కమాండింగ్‌గా అరుస్తున్నందుకే ఆయన ప్యాంటేసుకున్న ‘పెదరాయుడు’ లా కనిపిస్తాడు. గిరగిరా తిప్పి భుజాన వేసుకోవడానికి కండువా లాంటి న్యాప్కిన్ ఎలాగూ ఉంటుంది. నా దృష్టిలో సర్వర్ వృత్తి చాలా గొప్పది. ఎన్నెన్నో ప్లేట్లను, కప్పులను, గ్లాసులను ఏకకాలంలో నియంత్రించగలిగే సాధన ఉండాలి. ఏయే టేబుళ్లవాళ్లు ఏయే పదార్థాలను ఆర్డరిచ్చారో... జ్ఞాపకముంచుకుని, వారి వారి బిల్లులను తేడా రాకుండా చూసే సర్వారాయుణ్ణి చూస్తుంటే సివిల్ డ్రస్‌లో ఉన్న శతావధాని గుర్తుకొస్తాడు. సర్వర్‌ను చూసి ఫలహారాన్ని చూడమన్నారన్నది ఓ సామెత. టిఫిన్ ఎంత రుచిగా, శుచిగా ఉన్నా... సర్వర్ శుభ్రంగా లేకపోతే ఆ ఫలహారానికి విలువుండదు. ఓ సుల్తానుకు ఉన్నంత ఠీవి, ధీమా, దర్జా ఉండేలా ఆ యూనిఫామ్‌ను రూపొందిస్తారు. పైగా కిరీటంలాంటి టోపీ లేదా తలపాగా కూడా. టిప్పుల గలగలలతో ఆయన జేబు లక్ష్మీనిలయంలా అలరారుతుంటుంది. అందుకేనేమో గిట్టనివాళ్లు ఆయనని పొగుడుతున్నట్లే ఆడిపోసుకోవడానికి టిప్పుసుల్తాన్ అంటూ అక్కసు వెళ్లగక్కుతుంటారు. ఇన్ని గుణాలు ఉన్నందువల్ల చిన్నప్పుడు నేను సర్వర్ కావడం ఎంతో కష్టమైన పనిగానూ, దాన్ని సాధించడం అంటే పెట్టిపుట్టాలనీ అనుకునేవాణ్ణి. అయితే ఎప్పటికైనా అలా ఓ సర్వరోత్తముడిలా దర్జాగా అరిచి, టిఫిను సప్లై చేయాలన్న కోరిక మా బుజ్జిగాడు పుట్టడంతో తీరింది. ఇప్పుడు వాడు భోజనాలనీ, టిఫిన్లనీ, బిస్కెట్లనీ పురమాయిస్తుంటే... ప్లేట్ మీల్స్, ఒక పాల్, ఓ అరటిపండ్... అని అరుస్తున్నాను. అరుపూ నేనే అరచి, లోపల కిచెన్‌లో నుంచి ప్లేటందుకుని మా బుజ్జిగాడికి సప్లై చేస్తున్నాను. ఇలా నా ముచ్చట తీర్చుకుంటూ ‘ఇదీ కదా జీవితం. దీంతో నా రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయ్యింది’ అని నేనంటే మా ఆవిడ, ‘‘నీకు రొట్టె, నెయ్యి పెద్దగా ఇష్టం ఉండవు కదా! మనకో బుజ్జిది పుట్టి... అప్పుడు నువ్వు ‘ఒన్ పాల్ విత్ పాల్ పీకా’ అని అరిస్తే... అప్పుడు... ‘నీ ఇడ్లీ విరిగి చట్నీలో పడినట్టు’ అని నన్ను సవరించింది. - యాసీన్