అరుణాచల్ హైవే ప్రాజెక్టు ఏమిటి? చైనా మండిపాటు ఎందుకు? | What Is The Arunachal Highway Project? Why China Is Worried Sick? - Sakshi
Sakshi News home page

Arunachal Frontier Highway Project: అరుణాచల్ హైవే ప్రాజెక్టు ఏమిటి? చైనా మండిపాటు ఎందుకు?

Published Sat, Jan 6 2024 12:18 PM | Last Updated on Sat, Jan 6 2024 2:08 PM

What is Arunachal Pradesh Frontier Highway Project - Sakshi

భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా అనునిత్యం చొరబాటు ప్రయత్నాలను చేస్తోంది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు భారత్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ నేపధ్యంలోనే అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే పనులను భారత్ ప్రారంభించింది. 

ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సరిహద్దు ప్రాంతాలకు సైన్యం చేరుకోవడం మరింత సులభతరం కానుంది. అప్పుడు సైన్యం ఎల్‌ఏసీకి చేరుకోవడానికి అధిక సమయం పట్టదు. 1748 కి.మీ పొడవైన నేషనల్‌ హైవే-913ని పూర్తి చేయడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టనుంది. ఈ ప్రాజెక్ట్ 2027 నాటికి పూర్తికానుంది.

ఈ ప్రాజెక్టులో అంతర్జాతీయ సరిహద్దుకు ఐదు కిలోమీటర్ల లోపు ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లోని అన్ని గ్రామాలను ఆల్-వెదర్ రోడ్ల ద్వారా అనుసంధానం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.40 వేల కోట్లు వెచ్చిస్తున్నారు. 2016లో భారత్‌ ఈ ప్రాజెక్ట్  గురించి ప్రకటించిన తర్వాత చైనా దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరుదేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం పరిష్కారమయ్యే వరకు భారత్ ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించకూడదని చైనా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే చైనా అభ్యంతరాన్ని భారత్ పట్టించుకోలేదు.

ఈ ప్రాజెక్టులో భాగంగా హున్లీ- హ్యూలియాంగ్ మధ్య దాదాపు 121 కిలోమీటర్ల పొడవున హైవే నిర్మించనున్నారు. అదే సమయంలో హున్లీ- ఇతున్ మధ్య 17 కిలోమీటర్ల పొడవైన వ్యూహాత్మక వంతెన, టుటిన్ నుండి జిడో వరకు 13 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మిస్తున్నారు. అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే భూటాన్ సరిహద్దు సమీపంలోని తవాంగ్ నుంచి ప్రారంభమై భారత్-మయన్మార్ సరిహద్దు సమీపంలోని విజయనగర్‌లో ముగుస్తుంది. ఈ హైవే సిద్ధమైన తర్వాత తవాంగ్ సమీపంలోని బోమ్డిలా నుండి మయన్మార్ సరిహద్దు సమీపంలోని విజయనగరానికి అనుసంధానం ఏర్పడుతుంది.

అన్ని వాతావరణాల్లోనూ ఉపయుక్తమయ్యేలా ఈ రహదారిని నిర్మిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలు, చుట్టుపక్కల గ్రామాలకు ఈ రహదారితో అనుసంధానం ఏర్పడుతుంది. ఈ హైవే నిర్మాణం కోసం అనేక సొరంగాలు కూడా నిర్మించనున్నారు. ఈ హైవే భూటాన్ సరిహద్దు సమీపంలోని తవాంగ్ నుంచి ప్రారంభమై, భారత్-మయన్మార్ సరిహద్దులోని విజయనగర్ వద్ద ముగుస్తుంది. ఈ రహదారి భారతదేశం-టిబెట్-చైనా, మయన్మార్ సరిహద్దులకు దగ్గరగా వెళుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement