జ్యోతినగర్: రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు అందించేందుకు మొదలుపెట్టిన తెలంగాణ స్టేజీ–1లోని 800 మెగావాట్ల మొదటి యూనిట్ ఆదివారం రాత్రి 7.40 గంటలకు ఉత్పత్తి ప్రారంభించింది. 801.2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి దశలోకి వచ్చినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. 800 మెగావాట్ల యూనిట్ కంట్రోల్ రూంలో సీజీఎం కేదార్ రంజన్‌పాండుతో పాటు ఉన్నతాధికారులు, అధికారులు స్వీట్లు పంచుకుని అభినందనలు తెలుపుకొన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ ఉత్పత్తి కోసం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4000 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మించేందుకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఎన్టీపీసీ యాజమాన్యం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు స్టేజ్–1లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల రెండు యూనిట్ల నిర్మాణం చేపట్టారు. మొదటి యూనిట్ (800 మెగావాట్ల) నిర్మాణ పనులు వేగంగా కొనసాగాయి. స్టేజీ–1లో నిర్మితమైన 800 మెగావాట్ల మొదటి యూనిట్‌లో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి దశలోకి వచి్చన క్రమంలో ఈనెల 28లోపు కమర్షియల్ డిక్లరేషన్ చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్నట్లు సమాచారం.
ఆగస్టు నుంచి రెండో యూనిట్‌లో..?
ఎన్టీపీసీ తెలంగాణ స్టేజీ–1లో నిర్మితమైన 800 మెగావాట్ల రెండో యూనిట్ స్టీమ్ బ్లోయింగ్ మే 20న పూర్తి చేసుకుంది. టర్భైన్ జనరేటర్‌తోపాటు వివిధ పనులు పూర్తి చేశారు. రెండో యూనిట్ సైతం ఆగస్టులో విద్యుత్ ఉత్పత్తి దశలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. రెండు యూనిట్లలో విడుదలయ్యే మొత్తం 1600 మెగావాట్ల విద్యుత్ తెలంగాణ రాష్ట్రానికి పూర్తిస్థాయిలో అందించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment