సాక్షి, అమరావతి: ‘దిశ’ ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సమావేశానికి హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. '' గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులను యాక్టివ్‌గా చేయాలి. ఫిర్యాదు చేయడానికి మహిళలు పీఎస్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులకే ఫిర్యాదు చేసేలా చూడాలి. జీరో ఎఫ్‌ఐఆర్ అవకాశాన్ని విస్తృతంగా కల్పించాలి.
దిశ యాప్‌పై మహిళా పోలీసులకు అవగాహన, శిక్షణ కల్పించాలి. ప్రతి 2 వారాలకోసారి కలెక్టర్, ఎస్పీలు ప్రజా సమస్యలతో పాటు.. మహిళల భద్రతపైనా సమీక్ష నిర్వహించాలి. పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. దిశ ఎలా పనిచేస్తుందన్న దానిపై ప్రతి పీఎస్‌లో డిస్‌ప్లే ఏర్పాటు చేయాలి'' అని తెలిపారు.
గంజాయి రవాణా, సరఫరాపై ఉక్కుపాదం మోపాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం, పోలీసులపై దుష్ప్రచారం చేస్తున్న ఘటనల్లో నిజాలను ప్రజల ముందుంచాలన్నారు. బాధితులను ఆదుకునే విషయంలో ఆలస్యం జరగకూడదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment