‘జలశక్తి అభియాన్’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్న మోదీ | PM Modi To Launch Catch The Rain Campaign On World Water Day | Sakshi
Sakshi News home page

‘జలశక్తి అభియాన్’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్న మోదీ

Published Sun, Mar 21 2021 8:47 PM | Last Updated on Sun, Mar 21 2021 9:44 PM

PM Modi To Launch Catch The Rain Campaign On World Water Day - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ జలశక్తి దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేం‍ద్రమోదీ సోమవారం (మార్చి22)న ‘జలశక్తి అభియాన్’ ప్రాజెక్ట్‌ను వీడియో కాన్సరేన్స్‌ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టును కెన్‌, బెట్వా నదుల మధ్య నిర్మిస్తున్నారు. కేంద్ర జలశక్తి మత్రిత్వశాఖ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ప్రధానంగా  ఆయా రాష్ట్రాల్లో కరువు, నీటి కోరత ఉన్న ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. కెన్‌, బెట్వా నదులను అనుసంధానం చేయడంలో భాగంగా ధౌధాన్‌ డ్యామ్‌ను నిర్మించనున్నారు. వీటి అనుసంధానంతో ఏటా 10.62 హెక్టార్లకు నీటిపారుదల జరగనుంది.

62 లక్షల మందికి సురక్షిత తాగు నీరు లభిస్తుంది. ఈ నీటితో 103 మెగావాట్ల జల విద్యుత్‌ ఉత్పత్తి ​కూడా జరుగుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల బుందేల్‌ఖండ్‌, పన్నా, టికామ్‌గా, ఛతర్‌పూర్‌, సాగర్‌, దామో, డాటియా ప్రాంతాలకు నీరు లభిస్తుంది. మధ్యప్రదేశ్‌లోని రైసస్‌, బందా, మహోబా ప్రాంతాలు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌ ప్రాంతాలు  ప్రయోజనం పొందనున్నాయి.

ఈ జలశక్తి కార్యక్రమంలో భాగంగా ‘జలశక్తి అభియాన్‌: క్యాచ్‌ ది రెయిన్‌’ నవంబర్‌ 30 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని గ్రామీణా ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు పూర్తి స్థాయిలో అమలు కానుంది. ‘వర్షం ఎక్కడ, ఎప్పుడు పడినా.. ఆ నీటిని ఒడిసి పట్టుకోండి’ అనేది ఈ కార్యక్రమ నినాదం. 

చదవండి: త్వరలో కుంభమేళ.. ఈ సూచనలు పాటించాలి


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement