ఐటీ షేర్లలో అమ్మకాలు
రికార్డు గరిష్టస్థాయిలో ట్రేడవుతున్న ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో స్టాక్ సూచీలు క్షీణిం చాయి. ఆసియా మార్కెట్ల సానుకూలతతో ట్రేడింగ్ తొలిదశలో 21,304 పాయింట్ల స్థాయికి బీఎస్‌ఈ సెన్సెక్స్ పెరిగినప్పటికీ, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో 21,100 పాయిట్లలోపునకు పడింది. చివరకు 51 పాయింట్ల నష్టంతో 21,143 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 23 పాయిం ట్ల నష్టంతో 6,291 పాయింట్ల వద్ద ముగిసింది.
బీహెచ్‌ఈఎల్ ఫ్యూచర్లో షార్ట్ బిల్డప్: కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటును తగ్గించుకునే క్రమంలో భారీ ప్రత్యేక డివిడెండును ప్రభుత్వ రంగ కంపెనీల నుంచి కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ కంపెనీలు త్వరలో డివిడెండు ప్రకటించవచ్చన్న అంచనాలు ఊపందుకోవడంతో కొన్ని పీఎస్‌యూ షేర్లలో ఇన్వెస్టర్లు తాజా కొనుగోళ్లు జరిపారు. ఈ నేపథ్యంలో నగదు విభాగంలో బీహెచ్‌ఎల్ షేరు 3.5% ర్యాలీ జరిపి రూ. 179.40 వద్ద ముగిసింది. అయితే ఫ్యూచర్ కాంట్రాక్టులో షార్ట్ బిల్డప్ జరిగినట్లు డెరివేటివ్ డేటా వెల్లడిస్తున్నది. ఈ ఫ్యూచర్ 2.2% పెరుగుదలతో 170.95 వద్ద క్లోజయ్యింది. స్పాట్ ధరతో పోలిస్తే ఫ్యూచర్ ధర డిస్కౌంట్ రూ. 8 వరకూ పెరిగిపోయింది. క్రితం రోజు ఈ డిస్కౌంట్ రూ. 5 మాత్రమే. ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో తాజాగా 11.44 లక్షల షేర్లు యాడ్‌కావడంతో మొత్తం ఓఐ 3.97 కోట్ల షేర్లకు చేరింది. రూ. 180 స్ట్రయిక్ వద్ద భారీ కాల్‌రైటింగ్ జరగడంతో ఈ కాల్ ఆప్షన్లో బిల్డప్ 10.40 లక్షల షేర్లకు చేరింది. రూ. 170 పుట్ ఆప్షన్లో బిల్డప్ 4.54 లక్షల షేర్లకు పెరిగింది. అంచనాలకు తగిన డివిడెండు ప్రకటించకపోతే భారీ నష్టాలు వచ్చే అవకాశం వున్నందున, నగదు విభాగంలో జరిపిన కొనుగోళ్ల విలువను రక్షించుకునేందుకు ఇన్వెస్టర్లు బీఎహెచ్‌ఈఎల్ డెరివేటివ్స్‌లో షార్టింగ్ జరిపివుండవచ్చని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.