BHEL company
-
BHEL కంపెనీ దగ్గర ఉద్రిక్త వాతావరణం.. ఆక్టోపస్ దళాల హంగామాతో ప్రజల్లో భయం
-
తెలంగాణ పోలీసులకు సుప్రీం నోటీసులు
సాక్షి, సంగారెడ్డి : మహిళా ఉద్యోగి ఆత్మహత్య కేసులో తెలంగాణ పోలీసులకు, సీబీఐ అధికారులతోపాటు బీహెచ్ఈఎల్ యాజమాన్యానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గతేడాది అక్టోబర్‌లో బీహెచ్ఈఎల్లో ఉన్నతస్థాయి అధికారుల వేధింపుల కారణంగా నేహా చౌస్కి అనే ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఉద్యోగ సంస్థలో పై అధికారుల వేధింపుల కారణంగానే తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నేహా సుసైడ్ నోట్లో రాశారు. ఈ క్రమంలో కూతురు ఆత్మహత్యపై సీబీఐ విచారణ కోరుతూ నేహా తల్లిదండ్రులు సుప్రీం కోర్టును ఆదేశించారు. (బతికుండగానే చంపేశారు) ఈ నేపథ్యంలో సుసైడ్‌నోట్‌లో ఉన్న ఎనిమిది మందిని మియాపూర్ పోలీసులు ఎందుకు విచారణ జరపలేదని అత్యున్నత ధర్మాసనం జారీ చేసిన నోటీసులో పేర్కొంది. అదే విధంగా లేఖలో ఉన్న బీహెచ్ఈఎల్ అధికారులు, ఇతర ఉద్యోగులపై కూడా యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుందనే విషయంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్న మహిళపై అధికారుల వేధింపులపై ఫిర్యాదు అందినా సీబీఐ ఎందుకు స్పందించలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. (వికాస్ దూబే మరో సహచరుడు అరెస్టు!) -
బీహెచ్ఈఎల్కు స్వేచ్చ- చైనాకు చెక్
విద్యుత్ పరికరాల తయారీ దిగ్గజం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(బీహెచ్ఈఎల్)కు మరింత స్వేచ్చ(అటానమీ) ఇస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ పవర్ ప్లాంట్లను రూపొందించగలదని బిలియనీర్ పారిశ్రామికవేత్త అనిల్ అగర్వాల్ తాజాగా ట్వీట్ చేశారు. అటానమీ లేదా ప్రయివేటైజేషన్ చేపడితే.. బీహెచ్ఈఎల్ ఆత్మనిర్బర్ ఇండియాకు గొప్ప మద్దతునివ్వగలదని డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ చైర్మన్ అగర్వాల్ పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ప్లాంట్లను అందించగల సత్తా కంపెనీకి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. తద్వారా చైనా ప్రొడక్టులపై ఆధారపడటాన్ని మానుకోవచ్చని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా టర్న్‌కీ పద్ధతిలో విదేశాలలో సైతం పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయగలదని తెలియజేశారు. చైనాతో లడఖ్ సమీపంలో సైనిక వివాదం తలెత్తిన నేపథ్యంలో అనిల్ అగర్వాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. క్యూ4 వీక్ గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో బీహెచ్ఈఎల్ రూ. 1534 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 676 కోట్ల నికర లాభం ఆర్జించింది. కాగా.. ప్రస్తుతం బీహెచ్ఈఎల్ షేరుకి భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 16 శాతం దూసుకెళ్లి రూ. 32 వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ పరిమాణం సైతం నాలుగు రెట్లు ఎగసింది. బీఎస్ఈలో 2 కోట్ల షేర్లు చేతులు మారడం విశేషం! -
ఐటీ షేర్లలో అమ్మకాలు
రికార్డు గరిష్టస్థాయిలో ట్రేడవుతున్న ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో స్టాక్ సూచీలు క్షీణిం చాయి. ఆసియా మార్కెట్ల సానుకూలతతో ట్రేడింగ్ తొలిదశలో 21,304 పాయింట్ల స్థాయికి బీఎస్ఈ సెన్సెక్స్ పెరిగినప్పటికీ, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో 21,100 పాయిట్లలోపునకు పడింది. చివరకు 51 పాయింట్ల నష్టంతో 21,143 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 23 పాయిం ట్ల నష్టంతో 6,291 పాయింట్ల వద్ద ముగిసింది. బీహెచ్ఈఎల్ ఫ్యూచర్లో షార్ట్ బిల్డప్: కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటును తగ్గించుకునే క్రమంలో భారీ ప్రత్యేక డివిడెండును ప్రభుత్వ రంగ కంపెనీల నుంచి కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ కంపెనీలు త్వరలో డివిడెండు ప్రకటించవచ్చన్న అంచనాలు ఊపందుకోవడంతో కొన్ని పీఎస్‌యూ షేర్లలో ఇన్వెస్టర్లు తాజా కొనుగోళ్లు జరిపారు. ఈ నేపథ్యంలో నగదు విభాగంలో బీహెచ్ఎల్ షేరు 3.5% ర్యాలీ జరిపి రూ. 179.40 వద్ద ముగిసింది. అయితే ఫ్యూచర్ కాంట్రాక్టులో షార్ట్ బిల్డప్ జరిగినట్లు డెరివేటివ్ డేటా వెల్లడిస్తున్నది. ఈ ఫ్యూచర్ 2.2% పెరుగుదలతో 170.95 వద్ద క్లోజయ్యింది. స్పాట్ ధరతో పోలిస్తే ఫ్యూచర్ ధర డిస్కౌంట్ రూ. 8 వరకూ పెరిగిపోయింది. క్రితం రోజు ఈ డిస్కౌంట్ రూ. 5 మాత్రమే. ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో తాజాగా 11.44 లక్షల షేర్లు యాడ్‌కావడంతో మొత్తం ఓఐ 3.97 కోట్ల షేర్లకు చేరింది. రూ. 180 స్ట్రయిక్ వద్ద భారీ కాల్‌రైటింగ్ జరగడంతో ఈ కాల్ ఆప్షన్లో బిల్డప్ 10.40 లక్షల షేర్లకు చేరింది. రూ. 170 పుట్ ఆప్షన్లో బిల్డప్ 4.54 లక్షల షేర్లకు పెరిగింది. అంచనాలకు తగిన డివిడెండు ప్రకటించకపోతే భారీ నష్టాలు వచ్చే అవకాశం వున్నందున, నగదు విభాగంలో జరిపిన కొనుగోళ్ల విలువను రక్షించుకునేందుకు ఇన్వెస్టర్లు బీఎహెచ్ఈఎల్ డెరివేటివ్స్‌లో షార్టింగ్ జరిపివుండవచ్చని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఆర్టీపీపీలో ముందుకు సాగని ఆరవ యూనిట్ పనులు
ఎర్రగుంట్ల, న్యూస్‌లైన్: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో 6వ యూనిట్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనుల పర్యవేక్షణకు డెరైక్టర్లు రావడం, వెళ్లడం తప్ప అభివృద్ధిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీపీపీలో 600 మెగావాట్ల ప్రాజెక్టు పనులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అంకురార్పణ జరిగింది. సుమారు రూ. 3 వేల కోట్లతో ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పనులను బీహెచ్ఈఎల్, టెప్రో కంపెనీలు దక్కించుకున్నాయి. బీహెచ్ ఈఎల్ కంపెనీ సుమారు రూ. 1455 కోట్లతో బాయిలర్, ఈఎస్పీ పనులు చేపట్టింది. ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే టెప్రో కంపెనీ సుమారు రూ. 1255 కోట్లతో దక్కించుకున్నపనులు కొన్ని మధ్యలో ఆగిపోగా మరికొన్ని అసలు ప్రారంభమే కాలేదు. వీటిలో చిమ్నీ, కూలింగ్ టవర్, టర్బైన్ పనులు మధ్యలో నిలిచిపోయాయి. వీటికి సంబంధించిన ఇనుప కడ్డీలు తుప్పు పడుతున్నాయి. నాలుగు నెలల నుంచి ఈ కంపెనీ పనులు ఆగిపోయాయి. ఇక యాష్ ప్లాంట్, స్ట్రక్చరల్ స్క్రీన్, కోల్‌ప్లాంట్, ఆయిల్ పంప్‌హౌస్ పనులు ప్రారంభం కాలేదు. ప్రతి నెలా ఏపీ జెన్కో డెరైక్టర్లు రాధాకృష్ణ, కృష్ణమూర్తి, సివిల్ సీఈ రత్నబాబు పనుల పర్యవేక్షణకు వచ్చేవారు. అయినా ఈ పనుల్లో పురోగతి లేదు. జూలై నెల నుంచి డెరైక్టర్లు ఆర్టీపీపీకి రాకపోవడమే గాక కంపెనీల సమన్వయ సమావేశం కూడా నిర్వహించలేదు. ఇదిలా ఉండగా టెప్రో కంపెనీ జాడ ఆర్టీపీపీలో కనిపించడం లేదని కొందరు అధికారులే పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆరవ యూనిట్ పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయా అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఈనెల 12న మంగళవారం ఆర్టీపీపీకి ఎండీ విజయానంద్, ైడె రెక్టర్ రాధాకృష్ణ తదితరులు రానున్నారు. వీరు ఆరో యూనిట్ పనులపై దృష్టి సారిస్తారా లేదా అనే చర్చ జరుగుతోంది. ఆరో యూనిట్ పనులపై జెన్కో బోర్డు దృష్టి సారించి ఉంటే ఫలితం ఉండేదనే అభిప్రాయం ఆర్టీపీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.