ముంబై: మార్కెట్లో అత్యంత విలువ కలిగిన తొలి 10 కంపెనీల్లో అయిదింటి విలువ గతవారం భారీగా క్షీణించింది. గడిచిన వారం రోజుల్లో ఈ అయిదు కంపెనీల మార్కెట్ విలువ రూ.1,67,936 కోట్లు హరించుకుపోయాయి. గతవారం సెన్సెక్స్ 1,144 పాయింట్లు (1.57%) నష్టపోయింది. ఈ నెల 20న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ సాధారణ ట్రేడింగ్ నిర్వహించాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్, టీవీఎస్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఎస్‌బీఐల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ), ఐటీసీ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది.
► అత్యధికంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,22,163.07 కోట్లు నష్టపోయి రూ.11,22,662.76 కోట్లకు పరిమితమైంది. బ్యాంక్ డిసెంబర్ త్రైమాసికం ఫలితాలు మార్కెట్లను మెప్పించలేకపోయాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ల విక్రయానికి పాల్పడ్డారు. దీంతో ఈ షేరు బుధ, గురు, శుక్రవారాల్లో 12% నష్ట పోయింది. శనివారం ట్రేడింగ్ లో తిరిగి పుంజుకుని 0.54% లాభ పడింది.
► రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,199.35 కోట్లు నష్టపోయి రూ.18,35,665.82 కోట్లకు పరిమితమైంది. హిందూస్థాన్ యూనీలివర్ (హెచ్ యూఎల్) మార్కెట్ క్యాప్ రూ.17,845.15 కోట్ల పతనంతో రూ.5,80,184.57 కోట్లతో సరిపెట్టుకున్నది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,720.6 కోట్లు కోల్పోయి రూ.14,12,613.37 కోట్ల వద్ద స్థిర పడింది. ఎస్‌బీఐ మార్కెట్ క్యాప్ రూ.2,008.04 కోట్లు నష్టపోయి రూ.5,63,589. 24 కోట్ల వద్ద ముగిసింది.
► ఎల్‌ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ఎస్‌బీఐని దాటేయడంతో పాటు దేశంలోనే అత్యంత ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ గల సంస్థగా నిలిచింది. భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్ రూ.26,380.94 కోట్లు పెరిగి రూ.6,31, 679.96 కోట్లకు పెరిగింది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,170.75 కోట్లు పుంజుకుని రూ.6,84,305.90 కోట్ల వద్ద స్థిర పడింది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.3,163.72 కోట్లు పెరిగి రూ.7,07,373.79 కోట్ల వద్ద నిలిచింది. ఐటీసీ మార్కెట్ క్యాప్ రూ.2,058.48 కోట్లు పుంజుకుని రూ.5,84,170.38 కోట్లకు పెరిగింది.
5 కంపెనీల్లో రూ.1,67,936 కోట్ల ఆవిరి
Published Mon, Jan 22 2024 6:25 AM | Last Updated on Mon, Jan 22 2024 6:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment