
ముంబై: దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఐటీ షేర్లు భారీగా లాభపడ్డయ్యాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాతో పాటు ఎల్‌అండ్‌టీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాలను గడించాయి. సెన్సెక్స్ 393 పాయింట్లు లాభాపడి 52, 699 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 104 పాయింట్లతో 15,790.45 దగ్గర స్థిరపడింది.
ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకులు నష్టాలను చవి చూశాయి. రిలయన్స్ ఏజీఎం వార్షిక సర్వ సభ్య సమావేశ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ప్లాట్‌గా ముగిశాయి. నిఫ్టీలో ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాలను చవిచూశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, కోల్ ఇండియా, ఐఓసీఎల్, అదానీ పోర్ట్స్, ఓఎన్‌జీసీ షేర్లు నష్టపోయాయి.
చదవండి: Reliance AGM 2021: బోర్డులో స్వతంత్ర డైరక్టర్‌గా ఆరాంకో చైర్మన్..!