కేంద్ర ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ 2024-25లో బంగారం మీద కస్టమ్స్ సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తూ ప్రకటించింది. దీంతో దేశంలో పసిడి ధరలు ఒక్కసారిగా తగ్గాయి. చాలా రోజుల తరువాత భారీ మొత్తంలో బంగారం తగ్గడం ఇదే మొదటిసారి. బడ్జెట్ ప్రకటించిన రోజు నుంచి ఈ రోజు వరకు తులం బంగారం ధర ఏకంగా రూ. 4000 తగ్గింది.
సాధారణంగా దుబాయ్ వెళ్లే భారతీయులు చాలా వరకు బంగారం కొనుగోలు చేసి ఇండియాకు తీసుకు వస్తారు. అయితే బడ్జెట్ ప్రకటించిన తరువాత ఇండియాలో గోల్డ్ రేట్లు భారీగా తగ్గాయి. ఈ తరుణంలో బంగారం దుబాయ్ నుంచి కొనుగోలు చేయడం లాభదాయకమేనా అనేది ఒక ప్రశ్న. దీనికి పోప్లీ గ్రూప్ ఆఫ్ జువెలర్స్ డైరెక్టర్ రాజీవ్ పాప్లీ సమాధానమిచ్చారు.
కస్టమ్స్ డ్యూటీని భారతదేశంలో 6 శాతానికి తగ్గించారు. నిజానికి భారతదేశంలో కంటే దుబాయ్‌లో బంగారం తక్కువ అనేది కేవలం అపోహ మాత్రం. ఎందుకంటే మన దేశంలోనే కార్మిక వ్యయం తక్కువగా ఉంది. దీని వల్ల ఇండియాలో ధరలు గణనీయంగా తగ్గుతాయని రాజీవ్ పాప్లీ అన్నారు.
దుబాయ్‌లో నివాసముంటున్న ఎన్నారైలకు వ్యాట్ రీఫండ్‌లు లభించవు. అయితే విదేశాలకు వెళ్లి బంగారం కొనుగోళ్లు చేసే భారతీయులు వ్యాట్‌లో 60 శాతం మాత్రమే తిరిగి పొందుతారు.
ఇక్కడ మరో విషయం ఏమిటంటే మాకు భారతదేశం, యుఎఇ రెండింటిలోనూ స్టోర్‌లు ఉన్నాయి. ఇక్కడున్న వారు తమ జీవిత భాగస్వాములకు బంగారు గాజులు, నెక్లెస్ వంటివి కొనుగోలు చేసి తీసుకువస్తారు. అయితే గాజులు వారి చేతులకు సరిపోకపోవడం, నెక్లెస్ డిజైన్ నచ్చకపోవడం వల్ల మళ్ళీ వాటిని భారతదేశంలో మార్చాల్సి ఉంటుంది. ఇది సమయం వృధా మాత్రమే కాకుండా.. ఇంకా కొంచెం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది అని రాజీవ్ పాప్లీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment