న్యూఢిల్లీ : వరుసగా నాలుగో రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. స్థానిక జువెల్లర్ల కొనుగోళ్ల మద్దతుతో మంగళవారం రోజు బంగారం ధర 10 గ్రాములకు రూ.190 పెరిగి రూ.31,850గా నమోదైంది. ఇదే సమయంలో వెండి ధరలు రూ.150 మేర పడిపోయాయి. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో వెండి ధరలు కేజీకి రూ.150 తగ్గి, రూ.39,550గా ఉన్నాయి. డాలర్ బలహీనపడటంతో, అంతర్జాతీయంగా బంగారానికి పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతుందని ట్రేడర్లు చెప్పారు.
దీంతో బంగారం ధరలు పెరుగుతున్నట్టు పేర్కొన్నారు. గ్లోబల్‌గా బంగారం ధరలు 0.03 శాతం పెరిగి 1,333.30 డాలర్లుగా నమోదయ్యాయి. అంతేకాక స్థానికంగా కూడా జువెల్లర్లు తమ కొనుగోళ్లను పెంచారు. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో జువెల్లర్ల నుంచి బంగారానికి డిమాండ్ పెరిగింది. దీంతో దేశీయ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.190 చొప్పున పెరిగి రూ.31,850గా, రూ.31,700గా రికార్డయ్యాయి. గత మూడు సెషన్లలో బంగారం ధర రూ.310 మేర పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment