అలంకారంగానే ఫిట్‌నెస్ బ్యాండ్స్, వాచీలు
సమయం, తేదీ చూసుకునేందుకే వినియోగిస్తున్న 59% మంది
తిరిగిన అడుగులు లెక్కించేందుకే 66 శాతం మంది పరిమితం
గిఫ్ట్ ఐటంగా ఇచ్చినందున తీసుకున్నట్టు 13% మంది వెల్లడి
ఫిట్‌నెస్ వాచీలు, బ్యాండ్స్ వినియోగంపై లోకల్ సర్కిల్స్ సర్వేలో ఆసక్తికర అంశాలు
సాక్షి, హైదరాబాద్: కారణాలేవైనా జీవన శైలిలో ఎంతో మార్పు వచ్చింది. ఉరుకుల పరుగుల జీవితాల్లో తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇంత హడావుడిలో మన ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించడం ఒకింత కష్టం. అందుకే అంతా ఇందుకోసం సాంకేతికతను వాడుతున్నారు. ఏ రోజు ఎంత దూరం నడిచారు...పల్స్‌రేట్ ఎంత ఉంటోంది..నిర్ణీత సమయంలో ఎన్ని కిలోమీటర్లు నడిచారు..సైక్లింగ్, స్విమ్మింగ్ యాక్టివిటీ ఎలా ఉంది..ఇలా ప్రతిదీ రికార్డు చేసి, మనల్ని అప్రమత్తం చేసేందుకు మార్కెట్‌లో ఎన్నో రకాల ఫిట్‌నెస్ బ్యాండ్స్ / వాచీలు అందుబాటులో ఉన్నాయి.
చాలా మంది వీటిని ధరించడం సర్వసాధారణంగా కనిపిస్తోంది. ఒక్కో కుటుంబంలో ఐదుకు మించి కూడా ఈ ఫిట్‌నెస్ బ్యాండ్లు, వాచీలు ఉంటున్నాయి. అయితే ఫిట్‌నెస్ బ్యాండ్లను కొనుగోలు చేసినప్పుడు ఉన్నంత ఆసక్తి వాటిని వాడటంలో ఉండటం లేదు. కొన్న తర్వాత చాలామంది వాటిని పూర్తి స్థాయిలో వినియోగించడం లేదు.
కేవలం సమయం, తేదీ చూసుకు నేందుకు, ఫోన్‌కాల్స్ మాట్లాడేందుకు, మెసేజ్‌లు చూసుకునేందుకు వాడుతున్న వారే ఎక్కువ ఉంటున్నారని ‘లోకల్ సర్కిల్స్’ సంస్థ సర్వేలో వెల్లడైంది. ఇటీవల దేశవ్యాప్తంగా 278 జిల్లాల్లో 33,000 మంది నుంచి సేకరించిన అభిప్రాయాలతో సర్వే నివేదికను రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment