bands
-
‘ఫిట్‌లెస్’ బ్యాండ్స్!
సాక్షి, హైదరాబాద్: కారణాలేవైనా జీవన శైలిలో ఎంతో మార్పు వచ్చింది. ఉరుకుల పరుగుల జీవితాల్లో తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇంత హడావుడిలో మన ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించడం ఒకింత కష్టం. అందుకే అంతా ఇందుకోసం సాంకేతికతను వాడుతున్నారు. ఏ రోజు ఎంత దూరం నడిచారు...పల్స్రేట్ ఎంత ఉంటోంది..నిర్ణీత సమయంలో ఎన్ని కిలోమీటర్లు నడిచారు..సైక్లింగ్, స్విమ్మింగ్ యాక్టివిటీ ఎలా ఉంది..ఇలా ప్రతిదీ రికార్డు చేసి, మనల్ని అప్రమత్తం చేసేందుకు మార్కెట్లో ఎన్నో రకాల ఫిట్నెస్ బ్యాండ్స్ / వాచీలు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది వీటిని ధరించడం సర్వసాధారణంగా కనిపిస్తోంది. ఒక్కో కుటుంబంలో ఐదుకు మించి కూడా ఈ ఫిట్నెస్ బ్యాండ్లు, వాచీలు ఉంటున్నాయి. అయితే ఫిట్నెస్ బ్యాండ్లను కొనుగోలు చేసినప్పుడు ఉన్నంత ఆసక్తి వాటిని వాడటంలో ఉండటం లేదు. కొన్న తర్వాత చాలామంది వాటిని పూర్తి స్థాయిలో వినియోగించడం లేదు. కేవలం సమయం, తేదీ చూసుకు నేందుకు, ఫోన్‌కాల్స్ మాట్లాడేందుకు, మెసేజ్‌లు చూసుకునేందుకు వాడుతున్న వారే ఎక్కువ ఉంటున్నారని ‘లోకల్ సర్కిల్స్’ సంస్థ సర్వేలో వెల్లడైంది. ఇటీవల దేశవ్యాప్తంగా 278 జిల్లాల్లో 33,000 మంది నుంచి సేకరించిన అభిప్రాయాలతో సర్వే నివేదికను రూపొందించారు. -
Lok Sabha Election 2024: ఓట్ల ‘బ్యాండ్’ బాజా!
ఎన్నికల ప్రచారంలో ఎవరి గోల వారిదే! అభ్యర్థులు ఎడాపెడా హామీలతో ఓటర్లకు గాలం వేస్తుంటే, ఎన్నికల అధికారులేమో పోలింగ్ శాతం పెంచేందుకు ‘బ్యాండ్’ బాజా మోగిస్తున్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు, ముఖ్యంగా యువ ఓటర్లను బూత్‌లకు రప్పించేందుకు హర్యానా ఎన్నికల అధికారులు వినూత్నంగా మ్యూజికల్ బ్యాండ్లను రంగంలోకి దించుతున్నారు. ఎన్నికల థీమ్ సాంగ్స్‌తో మాంచి సంగీత విభావరుల ద్వారా వారిలో చైతన్యం పెంచే పనిలో పడ్డారు. ఈ బ్యాండ్లు ఓటర్లను, ముఖ్యంగా యువత ఓటేసేలా జోష్ నింపడంతో పాటు ఎన్నికలకు సంబంధించి ఓటర్లలో అవగాహన కూడా పెంచుతాయని హర్యానా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనురాగ్ అగర్వాల్ చెబుతున్నారు. పంచ్కులలో తొలి ఎలక్షన్ థీమ్ మ్యూజిక్ షో నిర్వహించనున్నట్లు తెలిపారు. తర్వాత యువ ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రతి జిల్లాలో ఇలాంటి మ్యూజిక్ బ్యాండ్స్ అలరిస్తాయని పేర్కొన్నారు. హర్యానాలో మొత్తం 10 లోక్‌సభ స్థానాలకు మే 25న ఆరో విడతలో పోలింగ్ జరగనుంది. దాదాపు రెండు కోట్ల మంది ఓటర్లు ఈవీఎం బటన్ నొక్కనున్నారు. ఇక్కడ 18–19 ఏళ్ల ఓటర్లు 3.65 లక్షల మంది ఉండగా 20–29 వయస్సున్న ఓటర్ల సంఖ్య 39 లక్షలు. మ్యూజిక్ అంటే ఫిదా అయిపోయే యువతను లక్ష్యంగా చేసుకునే ఈసీ బ్యాండ్ మోగిస్తోంది. లోక్‌సభ ఎన్నికల కోసం భారత ఎన్నికల సంఘం ’చునావ్ కా పర్వ్ – దేశ్ కా గర్వ్‘ (ఓట్ల సంబరం – దేశానికి గర్వకారణం) నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందని అగర్వాల్ చెప్పారు. ప్రజాస్వామ్యానికున్న పవర్‌ను, ఓటు ప్రాధాన్యాన్ని తెలుసుకోవడానికి యువత, ముఖ్యంగా తొలిసారి ఓటేసే యువతరం పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో హర్యానాలో 70 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి కనీసం 75 శాతాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నారట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
గవర్నర్‌ను కలిసిన ఏపీ బీజేపీ నేతలు
-
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారీగా భారం పడుతుంది
-
గోల్డ్ బాండ్స్ జారీకి రంగం సిద్ధం
-
బాండ్లు కాదు.. ప్రామిసరీ నోట్లు!
టీ సర్కార్ మరో కొత్త ఆలోచన సాక్షి, హైదరాబాద్: రైతులు రుణాలు చెల్లిస్తే... వారికి రెండు మూడేళ్లలో ప్రభుత్వం ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించే విధంగా హామీ పత్రం (పామిసరీ నోట్) ఇవ్వనున్నట్లు సమాచారం. రైతులు బ్యాంకులకు రుణం చెల్లించి ఎన్వోసీ (నిరభ్యంతర పత్రం) తీసుకుని వస్తే.. ప్రభుత్వం ఒక బాండును రైతుకు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఇటీవల వెల్లడించిన విషయం విదితమే. అయితే బాండ్లు జారీ చేయడం వల్ల అధికారికంగా అప్పు తెచ్చుకోవడమేనన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. దీంతో రైతులకు బాండ్ల రూపంలో కాకుండా హామీ పత్రం (ప్రామిసరీ నోట్) ఇచ్చే అంశాన్ని తాజాగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. రెండు మూడు సంవత్సరాల్లోగా రైతులకు ఆ రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాలని యోచనలో ఉంది. తగ్గనున్న భారం! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై రుణ మాఫీ భారం తగ్గుతోంది. ప్రస్తుతం అంచనా వేసిన రూ. 17,337 కోట్ల నుంచి రూ.14 వేల కోట్లకు తగ్గనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రుణమాఫీ అమలుకు జారీ చేసిన మార్గదర్శకాల తరువాత బ్యాంకర్లు రైతులకు ఇచ్చిన రుణాలపై బ్యాంకుల వారీగా, గ్రామం వారీగా లెక్కల క్రోడీకరణ పనిని ప్రారంభించిన విషయం విదితమే. ఒక రైతుకు మూడు నాలుగు బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లు, ఒక కుటుంబంలో ఉన్న అకౌంట్లను పరిశీలిస్తున్న బ్యాంకులు వీటన్నింటినీ ఒకే అకౌంట్‌గా మార్చాలని యోచిస్తున్నారు. ఇలా మార్చిన పక్షంలో ఒక కుటుంబానికి లక్ష రూపాయల వరకే మాఫీ చేయడం వీలవుతుందని, దీంతో ఈ భారం రెండువేల కోట్ల మేరకు తగ్గుతుందని ఆర్థికశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నేటి నుంచి జాబితా సిద్ధం బ్యాంకుల పరిశీలన ప్రక్రియను పూర్తిచేసి మంగళవారం లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేయనున్నారు. బుధవారం నుంచి గ్రామాల్లో సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మరోవైపు రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా ఇప్పటికే రుణాలు రీ షెడ్యూల్ చేయడానికి వంద మండలాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో.. మరో వెయ్యికోట్ల రూపాయలకు వెసులుబాటు కలుగుతుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. రైతు రుణమాఫీకి సంబంధించి వారం పదిరోజుల్లో పూర్తి స్పష్టత వస్తుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 31వ తేదీలోగా బ్యాంకుల నుంచి సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి చేరుతుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమాచారం వచ్చిన తరువాత ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సమావేశమై.. నిధులు ఏ విధంగా సర్దుబాటు చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. -
మూలనపడ్డ బాండ్లు
మున్సిపాలిటీ పరిధిలోని పొదుపు సంఘాల మహిళలు జనశ్రీ పథకంలో సభ్యత్వం తీసుకున్న వారి పిల్లల చదువుల కోసం ఉపకార వేతనాలు.. ఎదైనా ప్రమాదవశాత్తు మృతి చెందిన వారికి జనశ్రీ పథకం ద్వారా రుణాలు మంజూరవుతాయి. ఏడాది నుంచి వాటికి సంబంధించిన బాండ్లు అధికారులు ఇవ్వడంలేదు. బాండ్లు మాత్రం కార్యాలయంలో అధికారులు మూలనపడేశారు. అధికారులు స్పందించి బాండ్లు పంపిణీ చేయాలని కోరుతున్నారు. - పులివెందుల అర్బన్