సాక్షి, ముంబై: దేశీయ టాప్ సెల్లింగ్ యుటిలిటీ వెహికల్ మేకర్ మహీంద్రా అండ్ మహీంద్రా సెప్టెంబర్ త్రైమాసికంలో భారీ లాభాలను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో అంచనాలను మించి ఫలితాలను నమోదు చేసింది. నికర లాభాల్లో24.79 ఎగిసి రూ. 1,332 కోట్లను సాధించింది. గత ఏడాది త్రైమాసికంలో ఎం అండ్ ఎం నికర లాభం రూ .1,067 కోట్లు.
ఈ త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.12,182.07 కోట్లగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో రూ .11,446.14 కోట్లు ఆర్జించింది. ఈ క్వార్టర్లో 1,29,754 యూనిట్లు విక్రయించింది. ఇందులో ట్రాక్టర్ల విభాగంలో 76,984 యూనిట్ల విక్రయించగా, 11,755 యూనిట్లను ఎగుమతి చేసింది. ఈ త్రైమాసికంలో ఈబీఐటీడీఏ 45.6 శాతం పెరిగి రూ. 1729.8 కోట్లుగా ఉండగా, ఈబీఐటీడీఏ మార్జిన్ 14.2 శాతంగా ఉంది. ఆటో బిజినెస్‌లో ఎం అండ్ ఎం మంచి పురోగతి సాధించింది. ముఖ్యంగా పాసింజర్, యుటిలిటీ వెహికల్, ట్రక్కుల విభాగంలో వరుసగా 13.4శాతం, 27శాతం 86శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతోపాటు సాధారణ రుతుపవనాల కారణంగా ట్రాక్టర్ల వ్యాపారం కూడా 37 శాతం పెరుగుదలను సాధించింది.
ఈ ఏడాది జూలై నుంచి జీఎస్‌టీ అమలు కారణంగా ఈ గణాంకాలు పోల్చదగినవికాదని కంపెనీ బిఎస్ఇ ఫైలింగ్‌లో పేర్కొంది. అలాగే 1: 1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయాలని బోర్డు డైరెక్టర్లు సిఫార్సు చేసినట్టు తెలిపింది. రూ. 5 బోనస్ చెల్లించనున్నట్టు తెలిపింది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాటాదారుల ఆమోదాన్ని కోరనున్నట్టు కంపెనీ తెలిపింది.
ఇటీవల కాలంలో ఆర్థిక వృద్ధి మందగించిందని కంపెనీ పేర్కొంది. అయితే కొన్ని స్వల్పకాలిక కారకాల ప్రభావాలను మినహాయించి, జీఎస్‌టీ అమలు నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ సర్దుబాటు అనంతరం వృద్ధి ఊపందుకుంటుందని భావిస్తున్నామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment