సాక్షి, ముంబై: ప్రయివేటు బ్యాంకు కోటక్ మహీంద్ర క్యూ2లో మెరుగైన ఫలితాలను సాధించింది. 1747 కోట్ల రూపాయలను నికర లాభాలు నమోదు చేసింది. గత ఏడాదితో రూ. 1,441 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో 21 శాతం లాభాలు ఎగిశాయి. బ్యాంకు మొత్తం ఆదాయం రూ. 10,829 కోట్లను సాధించింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో రూ. ఆదాయం 9,140 కోట్లుగా ఉంది. ఎన్‌పీఏలు 2.14శాతంనుంచి 1.91 శాతానికి దిగి వచ్చాయని కంపెనీ ఫలితాల సందర్భంగా వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment