
సాక్షి, ముంబై: అదాని గ్రూపునకు చెందిన అదానీ పవర్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2 ఫలితాలను శనివారం ప్రకటించింది. స్టాండ్ ఎలోన్ ప్రాతిపదికన రూ. 256 కోట్ల నికర లాభాలను వెల్లడించింది. గత ఏడాది రూ.335 కోట్ల నష్టాలతో పోల్చితే లాభాలను పోస్ట్ చేయడం విశేషం. అంతేకాదు ఏప్రిల్ 2016 తరువాత వరుస అయిదు త్రైమాసిక నష్టాలను నుంచి కోలుకొని లాభాలను సాధించింది.
ఆదాయంలో (నిర్వహణ) సంవత్సరం ప్రాతిపదికన 22 శాతం పెరుగుదలను సాధించి రూ. 3460 కోట్లుగా నమోదు చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో రూ. 2828 కోట్లను సాధించింది.
కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గత ఏడాది 313 కోట్ల నష్టంతో పోలిస్తే ప్రస్తుత క్యూ2లో రూ. 293కోట్ల ఏకీకృత నికర లాభాలను సాధించింది. ఆదాయం 14శాతంవృద్ధి చెంది రూ.6,462 కోట్లను ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.5,670 కోట్లుగా ఉంది.