న్యూఢిల్లీ: అధిక వ్యయాల భారం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ విమానయాన దిగ్గజం ఇండిగో (ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్) నష్టాలు మరింత పెరిగాయి. రూ. 1,583 కోట్లకు చేరాయి. గత క్యూ2లో నష్టాలు రూ. 1,436 కోట్లు. సమీక్షా కాలంలో ఆదాయం రూ. 5,799 కోట్ల నుంచి రూ. 12,852 కోట్లకు పెరిగింది.
రెండో త్రైమాసికంలో మొత్తం వ్యయాలు రూ. 14,436 కోట్లకు పెరిగాయి. వరుసగా రెండో త్రైమాసికంలో కోవిడ్ పూర్వ స్థాయికి మించి కార్యకలాపాలు నమోదు చేసినట్లు ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ తెలిపారు. ‘సీజనల్‌గా రెండో త్రైమాసికంలో కార్యకలాపాలు బలహీనంగా ఉంటాయి కానీ, డిమాండ్ బాగుండటంతో మెరుగైన పనితీరు సాధించగలిగాం. అయితే, ఇంధన ధరలు, కరెన్సీ మారకం రేట్లు మా ఆర్థిక పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపాయి‘ అని ఆయన వివరించారు. దేశ, విదేశ మార్కెట్లలో అవకాశాలను అందిపుచ్చుకుంటూ రికవరీ బాటలో స్థిరంగా ముందుకు వెడుతున్నామని ఎల్బర్స్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment