రూ.322 కోట్లు డీల్‌, ‌టెక్‌ మహీంద్రా చేతికి మరో కంపెనీ! | Tech Mahindra to completely acquire Thirdware | Sakshi
Sakshi News home page

రూ.322 కోట్లు డీల్‌, ‌టెక్‌ మహీంద్రా చేతికి మరో కంపెనీ!

Published Mon, Mar 14 2022 3:09 PM | Last Updated on Mon, Mar 14 2022 3:09 PM

Tech Mahindra to completely acquire Thirdware - Sakshi

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టెక్‌ మహీంద్రా తాజాగా ఎంటర్‌ప్రైజ్‌ అప్లికేషన్‌ సంస్థ థర్డ్‌వేర్‌ను కొనుగోలు చేయనుంది. పూర్తి నగదు రూపంలో ఉండే ఈ డీల్‌ కోసం 42 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 322 కోట్లు) వెచ్చించనుంది. 

ఆటోమోటివ్‌ కన్సల్టింగ్‌, డిజైన్‌ తదితర విభాగాలకు సంబంధించి తమ డిజిటల్‌ సొల్యూషన్స్, సేవలను మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ కొనుగోలు దోహదపడగలదని టెక్‌ మహీంద్రా తెలిపింది.

ఈ ఏడాది మే నాటికి డీల్‌ పూర్తి కాగలదని భావిస్తున్నట్లు వివరించింది. థర్డ్‌వేర్‌ సొల్యూషన్స్‌లో 850 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ. 211 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల్లో రూ. 226 కోట్ల టర్నోవరు సాధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement