ప్రముఖ ఐటీ సంస్ధ టెక్ మహీంద్రా నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కొత్త ప్రోగ్రాంను టెక్ మహీంద్రా ప్రకటించింది. ఈ ప్రోగ్రాంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగ్గా వస్తాయని కంపెనీ అభిప్రాయపడింది.
సంయుక్తంగా..
టెక్ మహీంద్రాకు చెందిన సీఏస్ఆర్ విభాగం దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు ఉచిత క్లౌడ్ కంప్యూటింగ్ శిక్షణను అందించనుంది. AWS రీ/స్టార్ట్ ప్రోగ్రాంను టెక్ మహీంద్రా ఫౌండేషన్, అమెజాన్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా కలిసి నేర్పించానున్నయి. ఈ సందర్భంగా టెక్ మహీంద్రా ఫౌండేషన్ సీఈఓ రాకేష్ సోని మాట్లాడుతూ..."క్లౌడ్ కంప్యూటింగ్ అనేది 21వ శతాబ్దపు అద్భుత సాంకేతిక ఆవిష్కరణ. ఇది డిజిటల్ పరివర్తనను ఎనేబుల్ చేస్తోంది. కరోనా మహమ్మారి అనేక వ్యాపారాల క్లౌడ్ మైగ్రేషన్‌ను వేగవంతం చేసింది. ఈ ప్రోగ్రాం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని అన్నారు.
39 దేశాల్లో...
AWS రీ/స్టార్ట్ అనే ప్రోగ్రాం 39 దేశాలలో అందించబడుతుంది. ఈ ప్రోగ్రాం సహాయంతో 90 శాతం కంటే ఎక్కువ గ్రాడ్యుయేట్‌లను నేరుగా ఉద్యోగ ఇంటర్వ్యూ అవకాశాలతో అనుసంధానించనుంది. ఇది 12-వారాల జరిగే ప్రోగ్రాం. వ్యక్తిగతంగా, నైపుణ్యం-ఆధారిత శిక్షణను నిరుద్యోగులకు అందిస్తారు. దీనిలో ప్రాథమిక AWS క్లౌడ్ నైపుణ్యాలను, అలాగే ఇంటర్వ్యూ, రెస్యూమ్ రైటింగ్ వంటి ప్రాక్టికల్ కెరీర్ నైపుణ్యాలను కవర్ చేయనుంది. ఎంట్రీ-లెవల్ క్లౌడ్ పొజిషన్‌కు సిద్ధం చేయడంలో ఇది సహాయపడుతుంది. ఈ ప్రోగ్రామ్ ఆన్‌లైన్ లెర్నింగ్ ద్వారా హైదరాబాద్, మొహాలి, విశాఖపట్నం, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణేలలోని టెక్ మహీంద్రా స్మార్ట్ అకాడమీ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా సినారియో-బేస్డ్ ఎక్సర్‌సైజులు, హ్యాండ్-ఆన్ ల్యాబ్‌లు, కోర్స్‌వర్క్‌ల ద్వారా, విద్యార్థులు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ (లైనక్స్, పైథాన్), నెట్‌వర్కింగ్, సెక్యూరిటీ అండ్ రిలేషనల్ డేటాబేస్ స్కిల్స్ మొదలైనవాటిని కోర్సు ముగింపులో నేర్చుకుంటారని కంపెనీ తెలిపింది. కాగా కోర్సులో భాగంగా ఇప్పటికే మొదటి రెండు కోహోర్ట్‌లు ఫిబ్రవరి 9, 2022న ప్రారంభమయ్యాయని టెక్ మహీంద్రా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment