Tech Mahindra Foundation
-
నిరుద్యోగులకు టెక్ మహీంద్రా బంపరాఫర్...!
ప్రముఖ ఐటీ సంస్ధ టెక్ మహీంద్రా నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కొత్త ప్రోగ్రాంను టెక్ మహీంద్రా ప్రకటించింది. ఈ ప్రోగ్రాంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగ్గా వస్తాయని కంపెనీ అభిప్రాయపడింది. సంయుక్తంగా.. టెక్ మహీంద్రాకు చెందిన సీఏస్ఆర్ విభాగం దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు ఉచిత క్లౌడ్ కంప్యూటింగ్ శిక్షణను అందించనుంది. AWS రీ/స్టార్ట్ ప్రోగ్రాంను టెక్ మహీంద్రా ఫౌండేషన్, అమెజాన్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా కలిసి నేర్పించానున్నయి. ఈ సందర్భంగా టెక్ మహీంద్రా ఫౌండేషన్ సీఈఓ రాకేష్ సోని మాట్లాడుతూ..."క్లౌడ్ కంప్యూటింగ్ అనేది 21వ శతాబ్దపు అద్భుత సాంకేతిక ఆవిష్కరణ. ఇది డిజిటల్ పరివర్తనను ఎనేబుల్ చేస్తోంది. కరోనా మహమ్మారి అనేక వ్యాపారాల క్లౌడ్ మైగ్రేషన్‌ను వేగవంతం చేసింది. ఈ ప్రోగ్రాం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని అన్నారు. 39 దేశాల్లో... AWS రీ/స్టార్ట్ అనే ప్రోగ్రాం 39 దేశాలలో అందించబడుతుంది. ఈ ప్రోగ్రాం సహాయంతో 90 శాతం కంటే ఎక్కువ గ్రాడ్యుయేట్లను నేరుగా ఉద్యోగ ఇంటర్వ్యూ అవకాశాలతో అనుసంధానించనుంది. ఇది 12-వారాల జరిగే ప్రోగ్రాం. వ్యక్తిగతంగా, నైపుణ్యం-ఆధారిత శిక్షణను నిరుద్యోగులకు అందిస్తారు. దీనిలో ప్రాథమిక AWS క్లౌడ్ నైపుణ్యాలను, అలాగే ఇంటర్వ్యూ, రెస్యూమ్ రైటింగ్ వంటి ప్రాక్టికల్ కెరీర్ నైపుణ్యాలను కవర్ చేయనుంది. ఎంట్రీ-లెవల్ క్లౌడ్ పొజిషన్‌కు సిద్ధం చేయడంలో ఇది సహాయపడుతుంది. ఈ ప్రోగ్రామ్ ఆన్లైన్ లెర్నింగ్ ద్వారా హైదరాబాద్, మొహాలి, విశాఖపట్నం, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణేలలోని టెక్ మహీంద్రా స్మార్ట్ అకాడమీ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా సినారియో-బేస్డ్ ఎక్సర్సైజులు, హ్యాండ్-ఆన్ ల్యాబ్‌లు, కోర్స్‌వర్క్‌ల ద్వారా, విద్యార్థులు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ (లైనక్స్, పైథాన్), నెట్వర్కింగ్, సెక్యూరిటీ అండ్ రిలేషనల్ డేటాబేస్ స్కిల్స్ మొదలైనవాటిని కోర్సు ముగింపులో నేర్చుకుంటారని కంపెనీ తెలిపింది. కాగా కోర్సులో భాగంగా ఇప్పటికే మొదటి రెండు కోహోర్ట్‌లు ఫిబ్రవరి 9, 2022న ప్రారంభమయ్యాయని టెక్ మహీంద్రా తెలిపింది. -
సీఎం జగన్ ఆ మాటే నా 'ఇకిగయ్': గౌతమ్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్దేశించిన 30 నైపుణ్య కళాశాలల ఏర్పాటుతోనే మంత్రిగా తనకు సార్థకత అని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. బుధవారం రోజున టెక్ మహీంద్రా ఫౌండేషన్, బయోకాన్ లిమిటెడ్, స్నైడర్ ఎలక్ట్రిక్ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మంత్రి మేకపాటి, ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్, ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘విద్య, వైద్య, నైపుణ్య రంగంలో వసతుల కల్పనలో సీఎం రాజీపడరు. మనిషిని మనీషిగా మార్చేది చదువు అని నమ్మిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్. ఈ మధ్య తీరిక చేసుకుని జీవితకాల సంతోషమయ జీవితానికి రహస్యం 'ఇకిగయ్' అనే జపనీస్ పుస్తకం చదివా. ప్రతి పుట్టుకకు కారణం అనేది పుస్తకంలోని అంతరార్థం. ముఖ్యమంత్రి నిర్దేశించిన స్కిల్ కాలేజీలు ఏర్పాటు చేయడమే నా 'ఇకిగయ్'. (రాష్ట్రంలో బీహెచ్ఈఎల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ) నైపుణ్యరంగ పోటీలో మన రాష్ట్రం ప్రత్యేకం. సముద్రమంత లక్ష్యంలో నాతో పాటు నావలో ప్రయాణిస్తున్న నైపుణ్యశాఖ అధికారుల కృషి మాటల్లో చెప్పలేనిది. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ అధికారులకు ప్రత్యేక అభినందనలు. విశాఖలో లాజిస్టిక్స్ సెక్టార్లో టెక్ మహీంద్రా ఫౌండేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనుంది. లైఫ్ సైన్సెస్ డొమైన్లో నాలెడ్జ్ పార్టనర్‌గా బయోకాన్ వ్యవహరించనుంది. 12 స్కిల్ కాలేజీల్లో ఆటోమేషన్ అండ్ ఎనర్జీ మేనేజ్మెంట్ సెక్టార్లో స్కిల్ సెంటర్ల ఏర్పాటుకు స్నైడర్ ఎలక్ట్రిక్ అంగీకారం తెలిపింది' అని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఎంవోయూ కార్యక్రమానికి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంతరాము, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్, ఐ.టీ శాఖ సలహాదారు విద్యాసాగర్ రెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ స్పెషల్ కమిషనర్ ఎంఎం నాయక్, సీడాప్ సీఈవో ఎం మహేశ్వర్‌రెడ్డి, న్యాక్ అడిషనల్ డీజీ కెవి నాగరాజ, ఏపీఎస్ఎస్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వి. హనుమనాయక్, డాక్టర్ బి. నాగేశ్వరరావు, ప్రొఫెసర్ డి.వి. రామకోటిరెడ్డితో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. (కైనటిక్ గ్రీన్ ప్రతినిధులతో మేకపాటి భేటీ) -
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
హైదరాబాద్ : నిరుద్యోగ యువతి, యువకులకు ఉచిత కంప్యూటర్ శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాన్ని కల్పించనున్నట్లు టెక్ మహీంద్రా ఫౌండేషన్ నిర్వాహకులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. టెక్‌మహీంద్రా ఫౌండేషన్ వారి సహకారంతో యుగాంతర్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో పదవ తరగతి నుండి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన 18 నుంచి 27 సంవత్సరాలలోపు వయస్సు గల యువతి, యువకులకు మూడు నెలల పాటు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కంప్యూటర్ బేసిక్స్, ఎంఎస్ ఆఫీస్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ టైపింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ వంటి కోర్సులలో శిక్షణ అందించి శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు జూన్ 4వ తేదీ లోపు కూకట్పల్లి బస్టాప్ వద్ద గల శ్రీనివాస కాంప్లెక్స్‌లోని బాటాషోరూం పైన గల శిక్షణ శిబిరంలో గానీ, 8106630644 నెంబర్‌ను గానీ సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.