నిరుద్యోగులకు ఉచిత శిక్షణ | Free Coaching for Unemployed Youth | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

Published Tue, May 26 2015 7:07 PM | Last Updated on Sun, Sep 3 2017 2:44 AM

Free Coaching for Unemployed Youth

హైదరాబాద్ : నిరుద్యోగ యువతి, యువకులకు ఉచిత కంప్యూటర్ శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాన్ని కల్పించనున్నట్లు టెక్ మహీంద్రా ఫౌండేషన్ నిర్వాహకులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. టెక్‌మహీంద్రా ఫౌండేషన్ వారి సహకారంతో యుగాంతర్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో పదవ తరగతి నుండి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన 18 నుంచి 27 సంవత్సరాలలోపు వయస్సు గల యువతి, యువకులకు మూడు నెలల పాటు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కంప్యూటర్ బేసిక్స్, ఎంఎస్ ఆఫీస్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ టైపింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్‌వ్యూ స్కిల్స్ వంటి కోర్సులలో శిక్షణ అందించి శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు జూన్ 4వ తేదీ లోపు కూకట్‌పల్లి బస్టాప్ వద్ద గల శ్రీనివాస కాంప్లెక్స్‌లోని బాటాషోరూం పైన గల శిక్షణ శిబిరంలో గానీ, 8106630644 నెంబర్‌ను గానీ సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement