దుండిగల్: విద్యుదాఘాతంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బహదూర్‌పల్లి గ్రామానికి చెందిన సయ్యద్ అబ్దుల్ వాహెద్ కుమారుడు సయ్యద్ ఇస్మాయిల్ (26) స్థానికంగా ఉన్న టెక్ మహేంద్రాలో క్యాడ్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు.
ఈనెల 27న ఉదయం 6 గంటలకు మూత్ర విసర్జన కోసం ఇంటి బయటకు వచ్చాడు. ఆ సమయంలో అక్కడ తెగి పడి ఉన్న విద్యుత్ వైర్‌ను గమనించకుండా తాకడంతో షాక్ గురయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ ఇస్మాయిల్‌ను సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రిలో చేర్పించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
Published Fri, Jul 29 2016 10:25 AM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM
Advertisement